Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫార్మాసిటీ కోసం మరో 283 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ

ఫార్మాసిటీ కోసం మరో 283 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ

వార్త 1 week ago

Kandukur Mucharla Land: తెలంగాణ (TG) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్ ఫార్మాసిటీ (Hyderabad Pharma City) ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది.

ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో భారీ ఎత్తున పట్టా భూములను సేకరించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం మరో కీలకమైన అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

Read Also :Ebola: హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు అనుమానితులు

ముచ్చర్ల రెవెన్యూ పరిధిలో సేకరణ

ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం పరిధిలోని ముచ్చర్ల రెవెన్యూ గ్రామం పరిధిలో ఈ భూసేకరణ జరగనుంది. మొత్తం 283.22 ఎకరాల పట్టా భూములను ఫార్మాసిటీ అవసరాల నిమిత్తం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ నోటిఫికేషన్ వల్ల ముచ్చర్ల గ్రామానికి చెందిన దాదాపు 200 మంది రైతులకు సంబంధించిన పట్టా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

Kandukur Mucharla Land:నిబంధనల ప్రకారం పరిహారం

భూసేకరణ చట్టం ప్రకారం ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సర్వే నంబర్ల వివరాలను రెవెన్యూ అధికారులు త్వరలోనే వెల్లడించనున్నారు. భూములు కోల్పోతున్న రైతులకు చట్ట నిబంధనల ప్రకారం తగిన నష్టపరిహారం (Compensation) మరియు పునరావాస ప్యాకేజీని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఫార్మా రంగంలో అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను ఆకర్షించేందుకు, లక్షలాది మందికి ఉపాధి కల్పించేందుకు ప్రతిపాదించిన ఈ మెగా ప్రాజెక్టు కోసం ఇప్పటికే వేలాది ఎకరాలను సేకరించిన ప్రభుత్వం.. తాజా నోటిఫికేషన్‌తో మిగిలిన ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha