Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫైళ్ల క్లియరెన్స్‌కు 24 గంటలే గడువు.. అధికారులకు డెడ్‌లైన్!

ఫైళ్ల క్లియరెన్స్‌కు 24 గంటలే గడువు.. అధికారులకు డెడ్‌లైన్!

వార్త 3 months ago

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పాలనా వేగాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) నడుం బిగించారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అధికారుల జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు.

Read Also : KIMS Hospital in Amaravati: అమరావతిలో కిమ్స్ ఆసుపత్రి!

 CM Chandrababu: Only 24 hours for clearance of files.. Deadline for officials!

ఒక రోజులోనే ఫైల్ క్లియర్ కావాలి

సచివాలయంలో ఫైళ్ల కదలికపై సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫైళ్ల క్లియరెన్స్ కోసం ప్రస్తుతం ఉన్న రెండు రోజుల గడువును 24 గంటలకు (ఒక రోజు) కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది అధికారులు ఒక్కో ఫైల్‌ను 5 నుంచి 6 రోజుల పాటు పెండింగ్‌లో ఉంచుతున్నారని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సీఎం స్పష్టం చేశారు. పాలనలో వేగం పెరగాలని, ప్రతి ఫైల్ నిర్దేశిత సమయంలోపు క్లియర్ అవ్వాలని అధికారులను ఆదేశించారు.

మంత్రులకూ తప్పని సమీక్ష

కేవలం అధికారులే కాకుండా, మంత్రుల పనితీరుపై కూడా ముఖ్యమంత్రి నిరంతర సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. “పనితీరు రివ్యూ విషయంలో ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఉండదు” అని చంద్రబాబు తేల్చి చెప్పారు. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

రేపు బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి బయల్దేరనున్న చంద్రబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha