CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (శనివారం) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పర్యటించనున్నారు. అక్కడ కొత్తగా కొలువుదీరనున్న ప్రభుత్వ ప్రమాణ స్వీకారనికి అతిథిగా హాజరుకానున్నారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఆయన పర్యటనకు అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతుండటంతో, చంద్రబాబు పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also : KIMS Hospital in Amaravati: అమరావతిలో కిమ్స్ ఆసుపత్రి!

CM Chandrababu: విజయవాడ నుంచి కోల్‌కతాకు ప్రయాణం
ముఖ్యమంత్రి పర్యటన శనివారం ఉదయం ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం, ఉదయం 7:05 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుండి బయలుదేరతారు. తొలుత హెలికాప్టర్ ద్వారా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 7:40 గంటలకు ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు పయనమవుతారు. ఉదయం 9:20 గంటలకు కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుండి నేరుగా కార్యక్రమం జరిగే బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్తారు.
కార్యక్రమం అనంతరం హైదరాబాద్‌కు
కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే ప్రమాణ స్వీకార వేడుకలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ కొత్త ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన తిరుగు ప్రయాణమవుతారు. మధ్యాహ్నం 1:45 గంటలకు కోల్‌కతా విమానాశ్రయం నుండి బయలుదేరి, సాయంత్రం 3:45 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లనున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

