FIFA World Cup 2026: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న FIFA World Cup 2026 ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. ఫుట్‌బాల్ చరిత్రలోనే అతిపెద్ద ప్రపంచకప్‌గా నిలవనున్న ఈ టోర్నీ జూన్ 11, 2026న మెక్సికో సిటీలో ప్రారంభం కానుంది.
అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్‌లో రికార్డు స్థాయిలో 48 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 104 మ్యాచ్‌లు జరగనున్నాయి.
Read Also:Sreesanth Comments:ఒలింపిక్స్‌లో కోహ్లీ ఉండాల్సిందే.. సెలక్టర్లకు శ్రీశాంత్ కీలక సూచన!
48 జట్లు, 104 మ్యాచ్‌లు, కొత్త ఫార్మాట్‌తో ప్రపంచ ఫుట్‌బాల్ మహాసంగ్రామం

ఈసారి ప్రపంచకప్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో 32 జట్లు మాత్రమే పాల్గొనగా, ఇప్పుడు 48 జట్లకు విస్తరించారు. 12 గ్రూపులుగా విభజించిన ఈ టోర్నీలో ప్రతి గ్రూప్‌లో నాలుగు జట్లు ఉంటాయి. గ్రూప్ దశ ముగిసిన తర్వాత మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లతో పాటు, మూడో స్థానంలో నిలిచిన ఉత్తమ 8 జట్లు కూడా నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. దీంతో తొలిసారిగా “రౌండ్ ఆఫ్ 32” కూడా నిర్వహించనున్నారు.
ప్రస్తుత ఛాంపియన్ Argentina మరోసారి టైటిల్‌ను నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, Brazil, France, England, Spain, Germany వంటి జట్లు కూడా కప్ కోసం పోటీపడనున్నాయి. భారత్ ఈ టోర్నీలో పాల్గొనకపోయినా, దేశంలోని ఫుట్‌బాల్ అభిమానులు ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాల ఆటను ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనలు, టైటిల్ రేసు, నాకౌట్ మ్యాచ్‌లు అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
FIFA World Cup 2026:టోర్నీ ముఖ్యాంశాలు
- ప్రారంభ మ్యాచ్: జూన్ 11, 2026
- ఫైనల్: జూలై 19, 2026
- ఆతిథ్య దేశాలు: అమెరికా, కెనడా, మెక్సికో
- మొత్తం జట్లు: 48
- మొత్తం మ్యాచ్‌లు: 104
- గ్రూపులు: 12
- కొత్త నాకౌట్ దశ: రౌండ్ ఆఫ్ 32
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
20 నిమిషాల్లో ఒక గోల్, రెండు అసిస్ట్‌లతో మెరిసిన లియోనెల్ మెస్సీ!

