Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ఏబీవీపీ దీక్ష

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ఏబీవీపీ దీక్ష

వార్త 1 month ago

ABVP Strike: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ (అంబేద్కర్ చౌరస్తా)లో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ & స్కాలర్షిప్ బకాయిల విడుదలకై అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి నిరాహార దీక్షను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ABVP స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ & సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా సంవత్సరానికి సుమారు 14 లక్షల మంది SC, ST, BC, Minority పేద, మధ్యతరగతి విద్యార్థులు మెడికల్, లా, డిప్లమా, ఇంజనీరింగ్ మరియు డిగ్రీ కోర్సులలో ఉన్నత విద్యను చదువుకుంటున్నారు అని, ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు చదివిన సర్టిఫికెట్లు ఇవ్వక, ఉన్నత విద్యలకు వెళదామంటే రియంబర్స్మెంట్ రాక ఫీజులు కట్టలేక అనేక మంది విద్యార్థులు చదువులు అర్ధాంతరంగా ఆపేస్తున్నటువంటి దుస్థితి స్వరాష్ట్రంలో నెలకొంది అని మండిపడ్డారు.

పేద విద్యార్థులకు సంజీవని లాంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తి వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలో భాగంగా హైకోర్టులో నడుస్తున్నటువంటి కేసులో పదే పదే గౌరవ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయమన్నప్పటికీ ప్రభుత్వము నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో మధ్యంతర ఉత్తర్వుల పేరుతో విద్యార్థుల వద్దే రియంబర్స్మెంట్ డబ్బులు వసూలు చేయాలని చెప్పింది, అయినా కూడా ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత చదువులను దూరం చేస్తూ వారి కుటుంబాలను అప్పుల్లో ముంచి రోడ్డున పడేటువంటి పరిస్థితిని తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని వాపోయారు. ఇప్పటికైనా విద్యార్థిలోకమంతా ఏకమై ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రను తిప్పి కొట్టాలని అన్నారు, పెండింగ్లో ఉన్న 10,000 కోట్ల పేజీ నెంబర్స్మెంట్ స్కాలర్షిప్ కాయలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తు ఈన ఉద్యమానికి శ్రీకారం చూస్తామని హెచ్చరించారు. ఈ దీక్షలో రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ పవన్, రాష్ట్ర వనవాసి కోకన్వీనర్ పరశురాం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫణిందర్, మహేందర్, నగర కార్యదర్శులు జస్వంత్, గురు, మహిళా కార్యదర్శి మృదులయ్య, అంజి, లోకేష్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గోవులను జాతీయ ప్రాణిగా గుర్తించాలి: గౌసమ్మాన్ ఆహ్వాన్ అభియాన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha