Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: కోణం విఠల్

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: కోణం విఠల్

వార్త 3 weeks ago

Fee Reimbursement: మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేసి వారి భవిష్యత్తును కాపాడాలని సంగారెడ్డి జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కోణం విఠల్ డిమాండ్ చేశారు.

శుక్రవారం పెద్దశంకరంపేటలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు.

ఈ నిధులు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరారు.

విద్యార్థుల సమస్యలను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించాలని, వారి భవిష్యత్తుతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని కోణం విఠల్ హెచ్చరించారు.

విద్యకు సంబంధించిన సంక్షేమ పథకాలను సకాలంలో అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్న ఆయన, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులో జాప్యం వల్ల విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అన్నారు.

 Fee Reimbursement

ఈ సమావేశంలో పెద్దశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, బీజేపీ యువ మోర్చా (బీజేవైఎం) మండల అధ్యక్షుడు బుగుడాల కృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Executive Branch

Epaper: epaper.vaartha.com

త్వరలోనే తెలంగాణలో 50 వేల కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు.. మంత్రి సీతక్క

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha