Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విచారణ వాయిదా!

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విచారణ వాయిదా!

వార్త 3 weeks ago

TS High Court: తెలంగాణలో తీవ్ర సంచలనం రేపుతున్న కాలేజీ ఫీజుల వసూళ్లు మరియు ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) వివాదంపై తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల నుంచి అదనపు ఫీజుల వసూళ్లకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం గతంలో జారీ చేసిన వివాదాస్పద జీవో నంబర్ 9 (GO 9) పై దాఖలైన పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై సుదీర్ఘంగా వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. తదుపరి విచారణను రాబోయే సోమవారానికి వాయిదా వేసింది. అప్పటివరకు విద్యార్థులపై ఫీజుల భారం పడకుండా గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Read Also:Fee Reimbursement : తెలంగాణ విద్యార్థులకు శుభవార్త

TS High Court: జీవో-9లోని ఆ నాలుగు నిబంధనలపై ‘స్టే’ పొడిగింపు

ప్రభుత్వం జారీ చేసిన జీవో-9లోని కొన్ని నిర్దిష్ట క్లాజులు పేద, మధ్యతరగతి విద్యార్థుల రీయింబర్స్‌మెంట్‌ హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. జీవో-9లో పొందుపరిచిన అత్యంత కీలకమైన నాలుగు నిబంధనలపై (Four Regulatory Clauses) కోర్టు విధించిన స్టే సోమవారం వరకు కొనసాగుతుందని న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది. దీనివల్ల యాజమాన్యాలు కోర్టు తుది తీర్పు వచ్చే వరకు విద్యార్థుల నుండి ఏకపక్షంగా ఎలాంటి అదనపు ఫీజులను వసూలు చేయడానికి వీల్లేదు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి.

Epaper: epaper.vaartha.com

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి రేషన్ బియ్యం పంపిణీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha