Tsunami warnings in the Philippines: తీరప్రాంత దేశం ఫిలిప్పీన్స్‌ను సునామీ ముప్పు ముంచెత్తుతోంది. అధికారులు అధికారికంగా సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
సముద్ర గర్భంలో సంభవించిన మార్పుల కారణంగా ఎప్పుడైనా భారీ ఎత్తున రాకాసి అలలు తీరాన్ని తాకే ప్రమాదం ఉందని వాతావరణ మరియు విపత్తు నిర్వహణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఫిలిప్పీన్స్‌లోని సుల్తాన్ కుదరత్ (Sultan Kudarat) ప్రాంతంలో అప్పుడే సునామీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సముద్రపు నీరు ఒక్కసారిగా ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలకు దూసుకొచ్చింది. తీరప్రాంత రహదారులు, నివాస గృహాలు ఇప్పటికే జలమయమయ్యాయి. నీటి మట్టాలు నిమిషనిమిషానికి పెరుగుతుండటంతో స్థానిక అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Read Also: Donald Trump : ఇంటర్వ్యూ లో కోపంతో మైక్ పడేసి వెళ్లిపోయిన ట్రంప్
Tsunami warnings in the Philippines
Tsunami warnings in the Philippines :10 అడుగుల ఎత్తున ఎగసిపడనున్న రాకాసి అలలు
ఈ సునామీ ప్రభావం వల్ల సముద్రంలో సుమారు 10 అడుగుల (దాదాపు 3 మీటర్లు) ఎత్తు వరకు రాకాసి అలలు ఎగసిపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో అలలు వస్తే తీరప్రాంత గ్రామాలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో తీరప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వెంటనే తమ ఇళ్లను ఖాళీ చేసి, సురక్షితమైన ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ఇండోనేషియా, మలేషియాల్లో హై అలర్ట్ ఈ సునామీ ముప్పు కేవలం ఫిలిప్పీన్స్‌కే పరిమితం కాలేదు. పసిఫిక్ మహాసముద్ర పరివాహక ప్రాంతంలోని పొరుగు దేశాలైన ఇండోనేషియా, మలేషియాలకు కూడా సునామీ ప్రమాదం పొంచి ఉందని అంతర్జాతీయ విపత్తు హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ రెండు దేశాల్లోని తీరప్రాంత యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రజలు సముద్ర తీరాలకు దూరంగా ఉండాలని సూచించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ప్రధాని మోదీ ఇచ్చిన వజ్రాన్ని వెనక్కి ఇచ్చేశా.. జిల్ బైడెన్ ఆత్మకథలో సంచలన విషయాలు!

