Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫ్లైదుబాయ్ విమాన దాడిపై ట్రంప్ హెచ్చరిక

ఫ్లైదుబాయ్ విమాన దాడిపై ట్రంప్ హెచ్చరిక

వార్త 3 weeks ago

Trump Warning To Iran : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు ఇరాన్‌తో సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలితే టెహ్రాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అయితే, ప్రస్తుతం ఇరాన్ ప్రమేయంపై నిఘా సమాచారం సమీక్షలో ఉందని, దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టత వస్తుందని తెలిపారు. విమానంలో దాడికి పాల్పడిన కో-పైలట్‌కు ఇరాన్‌తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఇరాన్ ప్రమేయం నిర్ధారణ అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా దర్యాప్తు కొనసాగుతోందని, ప్రస్తుత దశలో ఇరాన్ ప్రమేయంపై తుది వ్యాఖ్యలు చేయడం తొందరపాటు అవుతుందని తెలిపారు.

Female prisoner in Tennessee : టెన్నెసీలో మహిళా ఖైదీకి మరణశిక్ష.. ఇంజెక్షన్ విఫలంతో నిలిపివేత

 Trump Warning To Iran

Trump Warning To Iran : ప్రయాణికులను కాపాడిన భారతీయ కెప్టెన్

ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన దాడిలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్ తీవ్రంగా గాయపడ్డారు. రక్తసిక్తమైన పరిస్థితుల్లోనూ కాక్‌పిట్ తలుపును అన్‌లాక్ చేయడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి చేరుకుని దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రయాణికులు వివరించారు. అనంతరం విమానాన్ని దారి మళ్లించి సౌదీ అరేబియాలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఫ్లైదుబాయ్ ఘటనపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకుంటామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధి, చమురు రవాణా, పశ్చిమాసియాలో అమెరికా సైనిక కార్యకలాపాలపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దాడి గురించి ఫోన్ కాల్‌లో ప్రధాని మోదీకి వివరించిన వీర పైలట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha