Dailyhunt
Flipkart: ఫుడ్ డెలివరీ రంగంలోకి ఈ-కామర్స్ సంస్థ ఎంట్రీ?

Flipkart: ఫుడ్ డెలివరీ రంగంలోకి ఈ-కామర్స్ సంస్థ ఎంట్రీ?

వార్త 1 month ago

వాల్‌మార్ట్‌కు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరో కీలక రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ-కామర్స్, క్విక్ కామర్స్ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఫ్లిప్‌కార్ట్, ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది.

ఈ నిర్ణయం దేశీయ ఆన్‌లైన్ ఫుడ్ మార్కెట్‌లో పెద్ద మార్పులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే మినిట్స్ పేరుతో క్విక్ కామర్స్ విభాగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ, మే-జూన్ నెలల్లో బెంగళూరులో ప్రయోగాత్మకంగా సేవలు ప్రారంభించనుంది. ఈ వార్తలతో స్విగ్గీ, జొమాటోల షేర్లు గురువారం స్వల్పంగా నష్టపోయాయి. ఫ్లిప్‌కార్ట్ స్వతంత్ర ప్లాట్‌ఫామ్‌ను నెలకొల్పుతుందా లేక ఓఎన్‌డీసీలో భాగమవుతుందా అనేది పరిశీలనలో ఉంది.

Announcer: అందరినీ మెప్పించిన దూరదర్శన్ న్యూస్ రీడర్ సరళా ఇక లేరు

Read hindi news: hindi.vaartha.com

Henley Passport Index 2026: పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha