మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో మానవ సంబంధాలను మంటగలిపే దారుణ ఘటన వెలుగుచూసింది. కేవలం మొబైల్ ఫోన్ పాస్‌వర్డ్ విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
రేవా జిల్లా సగరా పోలీస్ స్టేషన్ పరిధిలోని లౌఆ గ్రామానికి చెందిన దీపక్ మిశ్రా, శిఖా మిశ్రా దంపతులకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 8, 7, 5 ఏళ్ల వయసున్న ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మంగళవారం రాత్రి ఇద్దరూ మొబైల్ ఫోన్ వాడుతున్న సమయంలో ఒకరి పాస్‌వర్డ్ ఒకరు అడుగుతూ గొడవకు దిగారు.
Read Also: Bangalore incident: విషాదం.. మూడవ అంతస్తు నుండి కిందపడ్డ చిన్నారి (వీడియో)
Madhya Pradesh Crime
Madhya Pradesh Crime: పాస్‌వర్డ్ అడిగితే హత్య..
భార్య తన ఫోన్ పాస్‌వర్డ్ చెప్పడానికి నిరాకరించడంతో పాటు, భర్త ఫోన్ పాస్‌వర్డ్ అడగడం దీపక్‌కు కోపం తెప్పించింది. ఆగ్రహంతో ఊగిపోయిన దీపక్, ఇంట్లోని కత్తితో భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ముఖం, మెడ, పొత్తికడుపు భాగాల్లో తీవ్రంగా పొడవడంతో శిఖా రక్తపు మడుగులో పడిపోయింది. ఈ దారుణ కృత్యం జరుగుతున్నప్పుడు ముగ్గురు చిన్నారులు అక్కడే ఉన్నారు. తండ్రి తల్లిని చంపడం చూసిన పెద్ద కుమార్తె (8 ఏళ్లు), వెంటనే తన మేనమామకు ఫోన్ చేసి, “నాన్న అమ్మను చంపేశాడు” అంటూ బోరున విలపించింది. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శిఖా ప్రాణాలు విడిచింది. నిందితుడు దీపక్ మిశ్రా ఘటన అనంతరం పరారయ్యాడు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిన్న పిల్లల కళ్ల ముందే తల్లి హత్యకు గురికావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

