Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతోందా?

ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతోందా?

వార్త 2 months ago

Phone Hanging: మీ స్మార్ట్‌ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతూ విసిగిస్తోందా? అయితే దానికి పెద్ద పెద్ద రిపేర్లు అవసరం లేదు, కేవలం ఒకసారి 'రీస్టార్ట్' (Restart) చేస్తే సరిపోతుందని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్‌ను ప్రతిరోజూ లేదా కనీసం వారానికి రెండు సార్లు పూర్తిగా ఆఫ్ చేసి, మళ్లీ ఆన్ చేయడం వల్ల దాని పనితీరు (Performance) అద్భుతంగా మెరుగుపడుతుంది. సాధారణంగా మనం ఫోన్‌ను నిరంతరాయంగా వాడటం వల్ల మనకు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో అనేక అప్లికేషన్లు రన్ అవుతూ ఉంటాయి. ఫోన్‌ను రీస్టార్ట్ చేసినప్పుడు ఆ అనవసరపు బ్యాక్‌ఎండ్ యాప్స్, రన్నింగ్ ప్రాసెస్లు అన్నీ ఒకేసారి క్లోజ్ అయిపోతాయి. తద్వారా ఫోన్‌లోని తాత్కాలిక మెమొరీ లేదా ర్యామ్ (RAM) పూర్తిగా క్లియర్ అయి, ఫోన్ మళ్లీ కొత్తదానిలా సజావుగా పనిచేయడానికి మార్గం సుగమమవుతుంది.

Read Also : కొత్త ఆధార్ యాప్.. మీ డిజిటల్ గుర్తింపు ఇక మరింత సురక్షితం

స్పీడ్ పెరగడమే కాదు.. బ్యాటరీ, నెట్‌వర్క్ సమస్యలకూ చెక్!

స్మార్ట్‌ఫోన్‌ను క్రమంతప్పకుండా రీస్టార్ట్ చేయడం వల్ల కేవలం హ్యాంగింగ్ సమస్య మాత్రమే కాకుండా మరికొన్ని అదనపు ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ర్యామ్ క్లియర్ అవ్వడం వల్ల ఫోన్ ప్రాసెసింగ్ స్పీడ్ గణనీయంగా పెరుగుతుంది. అంతేకాకుండా, బ్యాక్‌గ్రౌండ్‌లో అనవసరంగా ఛార్జింగ్‌ను గుంజేసే యాప్స్ మూతపడటం వల్ల మొబైల్ బ్యాటరీ లైఫ్ (Battery Life) కూడా మెరుగవుతుంది. చాలా సార్లు ఫోన్‌లలో ఎదురయ్యే సిగ్నల్ డ్రాప్స్, మొబైల్ డేటా లేదా ఇంటర్నెట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం వంటి నెట్‌వర్క్ సమస్యలకు కూడా ఈ రీస్టార్ట్ ప్రక్రియ ఒక చక్కని పరిష్కారంగా పనిచేస్తుంది. ఫోన్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ రీఫ్రెష్ అవ్వడం వల్ల సిగ్నల్ కనెక్టివిటీ పుంజుకుంటుంది. కాబట్టి, ఫోన్ హ్యాంగ్ అయ్యే వరకు ఆగకుండా, వారానికి కనీసం రెండు సార్లయినా రీస్టార్ట్ చేయడం అలవాటు చేసుకోవడం మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఆపిల్ స్మార్ట్ గ్లాసెస్‌కు మళ్లీ షాక్.. 2027 వరకు వేచి చూడాలి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha