Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫోన్ ట్యాపింగ్ కలకలం.. అధికారుల తీరుపై హరీష్ రావు ఆగ్రహం

ఫోన్ ట్యాపింగ్ కలకలం.. అధికారుల తీరుపై హరీష్ రావు ఆగ్రహం

వార్త 5 months ago

Hyderabad News: హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా ఫోన్ల ట్యాపింగ్ సాగుతోందని హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఐపిఎస్ అధికారులు తమ వ్యక్తిగత ఫోన్లతో పాటు ఇంటి ముందున్న సిసి కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ వ్యవహారం అంతా ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read also: Iraq New Prime Minister: ఇరాక్ కొత్త ప్రధానిగా అలీ అల్-జైదీ

 Harish Rao addressing phone tapping issue

Hyderabad News: ఆధారాలు సిద్ధం: సమయం వచ్చినప్పుడు బయటపెడతాం

ప్రస్తుతం జరుగుతున్న అక్రమాలన్నింటికీ సంబంధించి తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. సరైన సమయం చూసి వీటన్నింటినీ ప్రజల ముందు ఉంచుతామని ఆయన హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరును ఏమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

అధికారంలోకి రాగానే లెక్కలు తేలుస్తాం: అధికారులకు హెచ్చరిక

రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టమని ఆయన అన్నారు. చట్టాన్ని అతిక్రమించి పని చేస్తున్న ప్రతి అధికారి శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం సరికాదని హరీష్ రావు హితవు పలికారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గత ప్రభుత్వాలు సిక్కిం అభివృద్ధిని అడ్డుకున్నాయి: కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ధ్వజం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha