Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ఫౌజీ' సినిమా విడుదల తేదీలో మార్పు?

'ఫౌజీ' సినిమా విడుదల తేదీలో మార్పు?

వార్త 2 weeks ago

Prabhas Fauji Movie: పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ'.

ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి ఫిల్మ్‌నగర్ వర్గాల్లో సరికొత్త ప్రచారం మొదలైంది. గతంలో ప్రకటించిన విడుదల తేదీ కంటే భిన్నంగా, ఈ చిత్రాన్ని 2027 మార్చి 18కి వాయిదా వేసే ఆలోచనలో మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

Jason Sanjay: హీరోగా మారుతున్న 'సిగ్మా' డైరెక్టర్ సంజయ్

 Change in the release date of the movie 'Fauji'?

Prabhas Fauji Movie: అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే టీజర్!

అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి సాలిడ్ 'గ్లింప్స్ / టీజర్' లేదా స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేకమైన రోజునే సినిమా కొత్త విడుదల తేదీపై కూడా స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

డిసెంబర్‌లో షూటింగ్ పూర్తి..

ప్రస్తుతం హైదరాబాద్ వేదికగా ఈ సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్‌పై కీలక సన్నివేశాలను పూర్తి చేసి, ఈ ఏడాది డిసెంబర్ నాటికి షూటింగ్‌ను ముగించాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇది 1940ల బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామా కావడం వల్ల గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉందట. అందువల్లే సినిమా రిలీజ్ డేట్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, ఛైత్ర ఆచార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. బిగ్ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రాబోయే బర్త్‌డే అప్‌డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రాజమౌళి 'వారణాసి'లో మరో సరికొత్త భాష?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha