Jason Sanjay: దళపతి విజయ్ వారసుడు జేసన్ సంజయ్ ప్రయాణం ఇప్పుడు కొత్త మలుపు తిరగబోతోంది. కెరీర్ ఆరంభంలో తండ్రిలా వెండితెరపై కనిపించడం కంటే, కెమెరా వెనుక ఉండి కథలను నడిపించడానికే సంజయ్ మొగ్గు చూపారు.
ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన 'సిగ్మా' చిత్రం ద్వారా ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు.
Read also: Mandadi Movie: ఓటీటీలోకి వచ్చేసిన 'మండాడి'.. సినిమా ఎలా ఉందంటే?
‘Sigma’ Director Sanjay Turns Hero
Jason Sanjay: 'సిగ్మా' ఫలితం.. హీరోగా మారే ఆలోచన!
గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న థియేటర్లలోకి వచ్చిన 'సిగ్మా' చిత్రంలో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఒక లైబ్రేరియన్ తన అప్పులను తీర్చుకునే క్రమంలో ఊహించని పరిస్థితుల్లో క్యాసినోలు, డ్రగ్ మాఫియా, క్రైమ్ ప్రపంచంలోకి ఎలా అడుగుపెట్టాడనే కాన్సెప్ట్‌తో సంజయ్ ఈ క్రైమ్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించారు. టెక్నికల్ అంశాలు, నటీనటుల ప్రతిభ బాగున్నప్పటికీ, రొటీన్ కథనం, ఊహకందే ట్విస్టుల కారణంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయింది. ఈ ఫలితంతో ఇప్పుడు సంజయ్ హీరోగా తెరంగేట్రం చేయనున్నారనే వార్త కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
హీరోగా లాంచ్‌కు లైకా ప్రొడక్షన్స్ స్కెచ్
'సిగ్మా' ఫలితం ఎలా ఉన్నప్పటికీ, జేసన్ సంజయ్ ప్రతిభపై నమ్మకముంచిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఇప్పుడు ఆయన్ను నేరుగా హీరోగా లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోందని సినీ వర్గాల టాక్. విజయ్‌కు ఉన్న అపారమైన క్రేజ్, స్టార్ ఇమేజ్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేలా, సంజయ్ డెబ్యూ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. సంజయ్‌ను హీరోగా నిలబెట్టేందుకు బలమైన మాస్, ఎమోషనల్ సబ్జెక్ట్ కోసం ప్రముఖ దర్శకులతో చర్చలు జరుపుతున్నారు.
ఈ డెబ్యూ ప్రాజెక్ట్ కోసం గతంలో యాక్షన్ చిత్రాలతో అలరించిన సీనియర్ దర్శకుడు లింగుసామితో పాటు పలువురు టాప్ డైరెక్టర్ల కథలను ఇప్పటికే పరిశీలిస్తున్నట్లు సమాచారం. డైరెక్షన్ రేసులో మరో కుటుంబ సన్నిహితుడి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. నటుడు విక్రాంత్ సోదరుడు, విజయ్ బంధువైన సంజీవ్ ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 'సిగ్మా' నిర్మాణ వ్యవహారాల్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, అడిషనల్ రైటర్‌గా సంజయ్‌తో కలిసి పనిచేసిన సంజీవ్, ఇప్పటికే సంజయ్ డేట్స్, కెరీర్ ప్లానింగ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సంజయ్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా ఓ యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేసే పనిలో ఆయన ఉన్నారని తెలుస్తోంది.
గంగూలీ బయోపిక్ పోస్టర్‌పై విమర్శలు.. స్పందించిన రాజ్‌కుమార్

