Maharashtra Crime News: భారత దిగ్గజం, ద్రోణాచార్య అవార్డు గ్రహీత జస్పాల్ రాణా అకాల మరణంతో క్రీడా ప్రపంచం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఇలాంటి తరుణంలో, మైదానాల్లో క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి వారిని ఉన్నత స్థాయికి చేర్చాల్సిన ఒక కీచక కోచ్..
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. ఫుట్‌బాల్ క్రీడలో గొప్ప అవకాశాలు కల్పిస్తానని నమ్మబలికి, ఓ మైనర్ క్రీడాకారిణిపై మూడేళ్ల పాటు లైంగిక దాడికి పాల్పడిన ప్రైవేట్ కోచ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని 36 ఏళ్ల అభిజిత్ మెండల్‌గా గుర్తించారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఈ ఘోరం చోటుచేసుకుంది.
Abhijit Mandal Football Coach
Read also:Assam Aircraft Crash: ల్యాండింగ్ సమయంలో కుప్పకూలిన AN-32 విమానం
అవకాశాల పేరుతో వల.. అశ్లీల వీడియోలతో బ్లాక్‌మెయిల్
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సదరు బాధిత బాలిక 2023లో వసాయి ప్రాంతంలోని అభిజిత్ ఫుట్‌బాల్ అకాడమీలో శిక్షణ కోసం చేరింది. ఈ క్రమంలో ఆమెతో అత్యంత చనువుగా ఉంటూ నమ్మకం సంపాదించుకున్న కోచ్.. క్రీడారంగంలో పెద్ద బ్రేక్ ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని బాలికపై పలుమార్లు లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా, సదరు మైనర్ బాలికకు తెలియకుండా కొన్ని అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలను కూడా రికార్డ్ చేశాడు. కొంతకాలం తర్వాత ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో (Social Media) అప్‌లోడ్ చేస్తానంటూ బాలికను నిరంతరం బెదిరిస్తూ, మానసిక ఒత్తిడికి గురిచేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు.
Maharashtra Crime News: తట్టుకోలేక కుటుంబ సభ్యులకు చెప్పడంతో బట్టబయలు
కోచ్ పెడుతున్న నిరంతర వేధింపులను, నరకాన్ని భరించలేకపోయిన ఆ బాలిక చివరకు ధైర్యం చేసి జరిగిన ఘోరాన్ని తన కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి నిందితుడు అభిజిత్ మెండల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
పోక్సో చట్టం కింద కఠిన కేసులు:
నిందితుడిపై అత్యాచారం, బెదిరింపులతో పాటు బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం (POCSO Act) లోని పలు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం కీచక కోచ్‌ను న్యాయస్థానం ముందు హాజరుపరిచి కస్టడీకి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

