Purusha movie trailer: ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన తాజా చిత్రం 'పురుష:'. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు.
వీరు వులవల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచుతూ ఆద్యంతం వినోదభరితంగా సాగే ట్రైలర్‌ను విడుదల చేసింది.
Read Also : Karuppu movie: ఇళయరాజాకు క్షమాపణలు చెప్పిన 'కరుప్పు' టీమ్
'Purusha' trailer released
Purusha movie trailer: భార్యల చేతిలో భర్తలు పడే తిప్పలు, నలిగిపోయే తీరు థియేటర్లలో నవ్వుల పూయించడం ఖాయమనిపిస్తోంది. "పెళ్లాం తిట్టినప్పుడు మన లోపల ఉన్న మగాడు పవర్ ఫుల్‌గా బయటకు వస్తాడు" లాంటి పంచ్ డైలాగ్స్ భర్తలకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. కమెడియన్ వెన్నెల కిషోర్ మార్క్ డైలాగ్‌తో ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అవుతుంది.
కేవలం కామెడీ మాత్రమే కాకుండా.. "ప్రేమ ఉన్న చోట నిజాయితీ ఉంటుంది.. నిజాయితీ లేని నీలాంటి వాడితో నేను ఉండలేను" అనే సంభాషణలతో కథలో మంచి ఎమోషనల్ టర్న్ కూడా ఉంటుందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ చిత్రాన్ని మే 22న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com

