Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ.. !

ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ.. !

వార్త 3 weeks ago

Rohith Sharma : క్రికెట్ మైదానంలో తన బ్యాటింగ్తో కోట్లాది మంది అభిమానులను అలరించిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

'హిట్మ్యాన్' ప్రధాన పాత్రలో రూపొందుతున్న కొత్త ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ షో 'ఫ్యామిలీ ఫుల్ హౌస్ (Rohith Sharma) విత్ రోహిత్ శర్మ'కు సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా అధికారికంగా టైటిల్, ప్రీమియర్ తేదీని ప్రకటించింది.

కుటుంబ సమేతంగా చూసే వినోద కార్యక్రమంగా :

ఈ కార్యక్రమం సెప్టెంబర్ 19, 2026 నుంచి లో స్ట్రీమింగ్ కావడంతో పాటు లో ప్రసారం కానుంది. అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కుటుంబ సమేతంగా చూసే వినోద కార్యక్రమంగా దీనిని రూపొందిస్తున్నట్లు సోనీ నెట్వర్క్ వెల్లడించింది. రోహిత్ శర్మకు ఇది ఎంటర్టైన్మెంట్ రంగంలో తొలి ప్రధాన టెలివిజన్ ప్రాజెక్ట్ కావడం విశేషం.

ఇప్పటివరకు క్రికెట్కు మాత్రమే పరిమితమైన ఆయనను.. ఈ షోలో సరికొత్త అవతారంలో చూడబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. రోహిత్కు ఉన్న సహజమైన హాస్యభావన, చమత్కారమైన మాటతీరు ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్లో రోహిత్కు సంబంధించిన వైరల్ 'గార్డెన్' డైలాగ్ను మరోసారి ప్రస్తావించడం ఆసక్తిని పెంచింది. అభిమానులు ఆ డైలాగ్ను మళ్లీ చెప్పాలని కోరగా, తన రెండు మాటలే ఇంత వైరల్ అయ్యాయని, పూర్తి షో వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ రోహిత్ సరదాగా స్పందించినట్లు సమాచారం.

అయితే షోలో రోహిత్ పాత్ర, గేమ్స్, పాల్గొనే సెలబ్రిటీలు, ఎపిసోడ్ల ఫార్మాట్ వంటి పూర్తి వివరాలను సోనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది. అధికారిక ప్రకటనలో రోహిత్ను షోకు 'హెడ్లైన్' చేస్తున్న వ్యక్తిగా పేర్కొన్నప్పటికీ, ఆయన పూర్తి స్థాయి యాంకర్గా వ్యవహరిస్తారా అనే అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

చల్ల అన్నం తింటే ఆరోగ్యానికి మేలు: నిపుణులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha