Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లేదా?

నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లేదా?

వార్త 2 weeks ago

Unemployment : దేశంలో ఉద్యోగ నియామకాల చుట్టూ పెరుగుతున్న అసంతృప్తి కేవలం నిరుద్యోగ సమస్యకు సంబంధిం చినది మాత్రమే కాదు. ఇది నియామక వ్యవస్థపై యువత లో పెరుగుతున్న నమ్మక సంక్షోభానికి ప్రతిబింబం.

ఒకవైపు ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, నిరు ద్యోగం తగ్గుతోందని గణాంకాలు చెబుతుండగా, మరోవైపు నేలమీద యువత అనుభవం పూర్తిగా భిన్నంగా కనిపిస్తోం ది. నియామకాల ఆలస్యాలు, పారదర్శకత లోపం, పేపర్ లీకులు, కోర్టు వివాదాలు, సమాచార అస్పష్టత, ఫలితాలపై అనుమానాలు వంటి అంశాలు యువతలో తీవ్రమైన అనిశ్చి తిని పెంచుతున్నాయి. ఈ సంక్షోభం అందరినీ సమానంగా ప్రభావితం చేయడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నూ, పట్టణ
పేదలలోనూ మొదటి తరంలో విద్యావకాశాలు పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ దళితబహుజన యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం ఉపాధి అవకాశాలు మాత్రమే కావు, అవి సామాజిక భద్రత, గౌరవం, కుటుంబ ఆర్థిక స్థిర త్వం, తరతరాల వెనుకబాటుతనాన్ని అధిగమించే మార్గం కూడా. అందువల్ల నియామక వ్యవస్థలో ఏర్పడుతున్న అవకతవకలు, ఆలస్యాలు, అపారదర్శక విధానాలు వీరిపైనే ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. లక్షలాది రూపాయలు అప్పులు చేసి, హైదరాబాద్లో కొన్నిప్రాంతాల్లో చిన్న చిన్న గదుల్లో సంవత్సరాల తరబడి జీవిస్తూ పరీక్షలకు సిద్ధమవు తున్న యువత పరిస్థితి ఈ సంక్షోభ తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. కుటుంబాల ఆశలు, అప్పులు, భవిష్యత్తు అన్నిం టినీ భుజకాలపై మోస్తూ చదువుతున్న యువతకు చివరికి ఎదురవుతున్నవి వాయిదాలు, రద్దయిన పరీక్షలు, కోర్టు కేసులు, అనిశ్చితి. ఒక విద్యార్థి కష్టపడి చదివితే ఉద్యోగం సాధించగలడనే పాథమిక సామాజిక నమ్మకాన్నే నియామక వ్యవస్థలోని అవ్యవస్థ దెబ్బతీస్తోంది.

Read Also : H1B Visa Applications : ఫీజులు భారీగా పెంచినా తగ్గని H-1B క్రేజ్.. లక్షల్లో దరఖాస్తులు

 Unemployment

Unemployment : అదే నిర్లక్ష్యం, అదే ఆలస్యం

దేశంలో నిరుద్యోగ పరిస్థితిపై అధికారిక గణాంకాలు కొంత మెరుగుదల కనిపి స్తున్నాయని చెబుతున్నాయి. కానీ అదేగణాంకాలు యువత కు స్థిరమైన, నాణ్యమైన ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నా యని కూడా సూచిస్తున్నాయి. సంఖ్యలు ఆశాజనకంగా కనిపిస్తున్నప్పటికీ, నేలమీద యువత అనుభవం మాత్రం భిన్నంగా ఉంది. ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన 69 వేల ఉపాధ్యాయ నియామకాలపై వచ్చిన నిరసనలు ఈ విభేదా నికి స్పష్టమైన ఉదాహరణ. తెలంగాణలో టీఎస్పీఎస్సీ పరీక్షల రద్దులు, గురుకుల నియామకాలపై వచ్చిన వివాదాలు కూడా ఇదే ఆందోళనను మరింత పెంచాయి. దీంతో ఉద్యోగాల సంఖ్యకంటే వాటి నియామక ప్రక్రియపై నమ్మకమే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. కాన్పూర్లో జరిగిన గందరగోళమో, తెలంగాణలో జరిగిన పేపర్ లీకేజీ లో కావొచ్చు, రాజకీయ పార్టీలు అధికారంలోకి రాకముందు యువతకు భారీ హామీలు ఇస్తాయి. ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, యువత భవిష్యత్తు గురించి గొప్పగా మాట్లా డుతాయి. కానీ అధికారంలోకి వచ్చినతర్వాత మాత్రం నియా మకాల విషయంలో అదే నిర్లక్ష్యం, అదే ఆలస్యం, అదేఅపార దర్శకత కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో యువతను దేశ భవిష్యత్తు అంటున్న రాజకీయ పార్టీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం నియామకాల విషయంలో చీఫ్గా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు పెరు గుతున్నాయి. కాన్పూర్కావచ్చు, తెలంగాణ కావచ్చు పార్టీ లు వేర్వేరు అయినా నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న అవ్యవస్థ మాత్రం ఒకేలా కనిపిస్తోంది.

సమాచార స్పష్టత లేకపోవడమూ ఒక పెద్ద సమస్య

నేటి నియామక వ్యవస్థలో ప్రధానసమస్య ఉద్యోగాల కొరత మాత్రమేకాదు, వాటి చుట్టూ ఉన్న సమాచార స్పష్టత లేకపోవడమూ ఒక పెద్ద సమస్య. తెలంగాణ గురుకుల నియామకాల సందర్భం లో ఒకే బోర్డు నిర్వహించిన ప్రక్రియలో పీజీటీ అభ్యర్థులకు మార్కులు, రెస్పాన్స్ షీట్లు చూసుకునే అవకాశం ఉండగా, టీజీటీ అభ్యర్థులకు అదే అవకాశం లేకపోవడం వివక్ష, అపా రదర్శకత ఆరోపణలకు దారితీసింది. ఒకే విధానంలో నిర్వ హించిన పరీక్షల్లో సమాచారం అందుబాటులో తేడాలు ఉండ టం పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఫలితాల ప్రక టన కేవలం ఎంపిక జబితాతో ముగియకూడదు. ప్రతి అభ్యర్థికి తన మార్కులు, కట్అఫ్లు, ఎంపిక ప్రమాణాలు స్పష్టంగా తెలిసే విధానం అవసరం. లేకపోతే నియామక వ్యవస్థపై అనుమానం పెరుగుతూనే ఉంటుంది. నియామక వ్యవస్థలో పారదర్శకత లోపం, ఆలస్యాలు, అనిశ్చితి వంటి సమస్యలు అందరినీ ప్రభావితం చేసినప్పటికీ, వాటి తీవ్ర ప్రభావం ప్రధానంగా దళితబహుజన యువతపైనే పడు తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణ పేదలలోనూ మొదటి తరంలో విద్యావకాశాలు పొందుతున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు జీవిత మార్పుకు కీలక ఆధారం. ఇప్పటికీ భూ ములు, వ్యాపారాలు, ప్రైవేట్ ఆర్థిక వనరులు అధికంగా కొన్ని అగ్రకుల వర్గాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్న నేప థ్యంలో, ఎస్సీ, ఎస్టీ, బీసీ యువత ప్రధానంగా విద్య, ప్రభుత్వ ఉద్యోగాల ద్వారానే ఎదుగుదలను ఆశ్రయిస్తున్నారు. అందువల్ల నియామకాలలో జరిగే ఆలస్యాలు, అవక తవకలు, అపారదర్శకత వీరిపైనే ఎక్కువ నం మోపుతు న్నాయి. నోటిఫికేషన్ల ఆలస్యాల వల్ల వయోపరిమితి దాటి పోతున్న అభ్యర్థుల్లో పెద్దసంఖ్య దళితబహుజన యువతదే.

 Unemployment

వ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ..

కుటుంబ ఆర్థిక బలహీనతల మధ్య సంవత్సరాల తరబడి సిద్ధమవుతున్న వారికి ఈ ఆలస్యాలు తిరిగి కోలుకోలేని నష్టంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం రాక, ప్రైవేట్ రంగంలో స్థిరపడలేకపోవడంవల్ల అనేక మంది తీవ్ర మాన సిక ఒత్తిడికి గురవుతున్నారు. యువత పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల వైపు రావడాన్ని కొంత సామాజిక ఆధి పత్య వర్గాలు అసహనంతో చూడటం కూడా కనిపిస్తోంది. నియామక వ్యవస్థలో ఏర్పడుతున్న అనుమానాలు, వివా దాలు ఈ అసమాన సామాజిక నిర్మాణంతో సంబంధం లేకుండా చూడలేం. మన దేశ సామాజిక వ్యవస్థలో అణ గారిన వర్గాలకు విద్య, అధికార, రాజ్యపాలన హక్కులను నిరాకరించిన మనుధర్మ ఆధారిత సామాజిక నిర్మాణం చారిత్రకంగా పనిచేసింది. ‘విద్య’, ‘అధికార’, ‘రాజ్యపాలన’ కొన్ని వర్గాలకే పరిమితమవ్వాలని భావించిన ఆ సామాజిక దృక్పథం ఆధునిక రాజ్యాంగ విలువలకు విరుద్ధం. రాజ్యాం గం సమాన అవకాశాల దిశగా మార్గం చూపించినప్పటికీ, నియామక వ్యవస్థలో కనిపిస్తున్న అసమానతలు ఇంకా సామాజిక న్యాయం పూర్తిగా సాధ్యపడలేదనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. వ్యవస్థపై విశ్వాసం కోల్పోతే అది కేవలం ఉద్యోగ సమస్యగా మిగలదు. ప్రజాస్వామ్యంపై నమ్మక సంక్షోభంగా మారుతుంది.

-పాపని నాగరాజు

Read hindi news : hindi.vaartha.com

Epaepr: epaper.vaartha.com

Read Also:

ఈనెల 10లోపు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha