NBK 111 Movie Update: నటసింహ నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం 'NBK 111' షూటింగ్ ల్లో భాగంగా ఇటీవల ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దర్శకుడు గోపీచంద్ మలినేని కాకినాడ పోర్ట్ నేపథ్యంలో చిత్రీకరిస్తున్న ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా ఆయన ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డారు.
దీనితో వైద్యుల సలహా మేరకు ఆయన మోకాలికి శస్త్ర చికిత్స (Knee Surgery) విజయవంతంగా పూర్తయింది.
Read Also : Epic Movie: 'ఎపిక్' ట్రైలర్ లాంచ్.. ముఖ్య అతిథిగా రష్మిక మందన్న!
Balakrishna recovers from injury; new schedule for ‘NBK 111’ finalized!
NBK 111 Movie Update: సర్జరీ తర్వాత మొదటిసారి బయటకు.. వీడియో వైరల్
మోకాలి శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న బాలకృష్ణ, తాజాగా తన సతీమణి వసుంధర దేవితో కలిసి ఓ అభిమాని వివాహ ఆహ్వాన పత్రికను స్వీకరిస్తూ కనిపించారు. సర్జరీ తర్వాత ఆయన ఎంతో ఆరోగ్యంగా, చిరునవ్వుతో కనిపిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తమ అభిమాన నటుడు క్షేమంగా, వేగంగా కోలుకోవడంతో నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్ 15 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం
ఈ ప్రమాదం వల్ల కొద్దిరోజులు షూటింగ్‌కు విరామం లభించినప్పటికీ, బాలకృష్ణ మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న ‘NBK 111’ కొత్త షెడ్యూల్‌లో ఆయన పాల్గొననున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. తమ ప్రియతమ నటుడు మళ్లీ పూర్తి ఆవేశంతో కెమెరా ముందుకు రాబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
నేపాల్‌కు సోనూసూద్ సాయం.. పబ్లిసిటీ అంటూ ట్రోల్స్: సోనూ సూద్ హుందైన రిప్లై

