India Test Captain Gill : శ్రీలంక పర్యటనలో ఉన్న భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్ర గాయానికి గురయ్యారు. రేపు శ్రీలంక ఎలెవన్‌తో జరగనున్న కీలక ప్రాక్టీస్ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన శిక్షణ సమయంలో ఆయన కుడి చేతి బొటనవేలికి దెబ్బ తగిలింది.
నెట్స్ నెట్ ప్రాక్టీస్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒకసారి బంతి బలంగా తగలడంతో నొప్పితో ఇబ్బంది పడిన గిల్, కొద్దిసేపటి విశ్రాంతి అనంతరం తిరిగి బ్యాటింగ్ కొనసాగించారు. అయితే, ఆ తర్వాత జరిగిన ఫీల్డింగ్ డ్రిల్స్‌లో అదే బొటనవేలికి మళ్లీ గాయం కావడంతో ఆయన నొప్పితో తీవ్రంగా విలవిల్లాడుతూ కనిపించారు. వెంటనే స్పందించిన వైద్య బృందం ఆయనకు ప్రాథమిక చికిత్స అందించింది.

మెడికల్ టీమ్ పరిశీలన: రేపటి మ్యాచ్‌లో ఆడటంపై ఉత్కంఠ
కెప్టెన్ గిల్ గాయం తీవ్రత ఎంతవరకు ఉందనే దానిపై ప్రొఫెషనల్ మెడికల్ టీమ్ ప్రస్తుతం తీవ్రంగా పరిశీలిస్తోంది. టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు ఈ గాయం కావడం భారత మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానుల్లోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గాయం తీవ్రతను బట్టి రేపటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆయన ఆడతారా లేదా అనే విషయమై బిసిసిఐ (BCCI) నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. రాబోయే ముఖ్యమైన టెస్టు మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని, ముందస్తు జాగ్రత్త చర్యగా రేపటి ప్రాక్టీస్ మ్యాచ్ నుంచి గిల్‌కు విశ్రాంతినిచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

