Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గచ్చిబౌలి లేక్‌ఫ్రంట్‌లో యోగా దినోత్సవ వేడుకలు

గచ్చిబౌలి లేక్‌ఫ్రంట్‌లో యోగా దినోత్సవ వేడుకలు

వార్త 2 weeks ago

Gachibowli: శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించడం లక్ష్యంగా తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ), అనుబంధ విభాగం తెలంగాణ ఈవెంట్ ఫెసిలిటేటర్స్ అసోసియేషన్ (టెఫా)తో కలిసి గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ యొక్క సుందరమైన సరస్సు తీరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించింది.

నేహా శుక్లా ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. ఆ తర్వాత వివేక్ దేపల్లె నేతృత్వంలో ధ్యానం, శ్వాసక్రియ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ వెంకటరమణ మాట్లాడుతూ ఒత్తిడితో కూడిన ఈ ప్రపంచంలో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత అత్యవసరం అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ అధ్యక్షుడు బలరాం బాబు, జనరల్ సెక్రటరీ రవి బురా, కోశాధికారి తౌఫిక్ ఎం ఖాన్, ఉపాధ్యక్షుడు వెంకటేష్, తెలంగాణ ఈవెంట్ ఫెసిలిటేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కుమార్ రాజా, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 కన్వీనర్‌ అజ్మత్ అలీ, కో కన్వీనర్‌ జిజ్ఞా మెహతా తదితరులు పాల్గొన్నారు.

Gachibowli: భారతదేశంలో ప్రముఖ ప్రాంతీయ ఈవెంట్ సంస్థలలో ఒకటిగా ఉన్న తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా.. ఆరోగ్యం, కమ్యూనిటీ భాగస్వామ్యం, విజ్ఞాన మార్పిడి, సామాజిక బాధ్యతను పెంపొందించే కార్యక్రమాలు నిరంతరం ప్రోత్సహిస్తూ వస్తోంది. వార్షిక అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ అనేది ఆరోగ్యకరమైన, సంపూర్ణమైన, వృత్తిపరమైన వ్యవస్థను పెంపొందించడంలో ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం.

సదాశివపేట వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha