Sadashivpet: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సదాశివపేట వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్‌ఎస్ పార్టీరాష్ట్ర నాయకులు శివరాజ్ పాటిల్ హాజరై యోగా ప్రాధాన్యతపై ప్రసంగించారు. ఈ సందర్భంగా యోగా సాధకులు, క్రీడాకారులకు యోగా మ్యాట్లను అందజేసి వారిని అభినందించారు. అనంతరం యోగా అభిమానులతో కలిసి వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు నిర్వహించి యోగాభ్యాసంలో పాల్గొన్నారు.
శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ, నేటి సమాజంలో ప్రతి వ్యక్తి నిత్యజీవితంలో అనేక రకాల పనులు, బాధ్యతల కారణంగా ఒత్తిడికి గురవుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగ ఎంతో అవసరమని తెలిపారు. మన పూర్వీకులు అందించిన ఈ అమూల్యమైన యోగా సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగంగా చేసుకుని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. యోగా ద్వారా ఒత్తిడిని అధిగమించడంతో పాటు ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత పెంపొందుతాయని పేర్కొన్నారు.
Sadashivpet: ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ నిర్వాహకులు మదన్ మోహన్ గౌడ్, స్థానిక నాయకులు విజయ్ కుమార్, రాజు, వ్యాయామ ఉపాధ్యాయులు కలాలి శ్రీనివాస్ గౌడ్, మన్సూర్ అహ్మద్, బాలు ఆర్ట్స్ అంబదాస్, ముజీబ్ మాస్టర్, శేఖర్, అశోక్, శ్రీనివాస్, సూర్య మోహన్, మన్నె మహేష్, చిన్న, నవీన్ తదితరులు పాల్గొన్నారు. యోగ ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాభ్యాసాన్ని అలవాటు చేసుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్నవారు పిలుపునిచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
యోగాసనాలు వేసిన కలెక్టర్ ప్రతిమా సింగ్.. వృద్ధాప్య ఆరోగ్యంపై కీలక సందేశం!

