Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వరి ధాన్యం కొనుగోళ్లపై అగ్రహం వ్యక్తం చేస్తున్న రైతన్నలు

వరి ధాన్యం కొనుగోళ్లపై అగ్రహం వ్యక్తం చేస్తున్న రైతన్నలు

వార్త 2 months ago

Chinna kodur: అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయ లోపంతో నిర్లక్ష్యం, కొనుగోలు కేంద్రాల్లో దాన్యం బోసి నెల రోజులు దాటిన కాంఠా బెట్టని అధికారులు..

చిన్నకోడూరు, ఆరు కాలం కష్టించి పండించిన పంట కొనుగోలు జరపడంలో అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయ లోపం కారణంగా రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో దాన్యం పోసి నెల రోజులు దాటిన కాంట్రాబెట్టని పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నకోడూరు మండలంలోని రామంచ వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతులు విసిగి చెంది మంగళవారం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిరసన గళం వినిపించారు. ధాన్యం కొనుగోలు సెంటర్లో పోసిన నుంచి ఇప్పటివరకు అనేక అవస్థలు ఆట్లు పాట్లు పడుతూ పంటను రక్షించుకుంటూ నెల రోజులుగా పడి కాపులు కాస్తున్నారు. గన్ని బ్యాగుల కొరత, మౌలిక వసతుల సౌకర్యం వంటి కల్పించకపోవడంతో రైతులు రేయి భవండు అవస్థలు పడుతున్నారు.

Read Also: Telangana Formation Day Celebrations: బస్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

 Farmers expressing dissatisfaction over paddy grain purchases

Chinna kodur: సమస్యల వలయంలో రైతులు

హమాలీల కొరత, రైస్ మిల్లర్లు దాన్యం దింపుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. వాహనాల కొరత, తదితర సమస్యలపై రైతులు అవస్థలు పడుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శనాలు చాలా ఉన్నాయి. పేరుకే ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే నాయకులు అటువైపు కన్నెత్తులు చూడకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోహిణి కార్తి మొదలై వారం రోజులు దాటిన కొనుగోలు సెంటర్లోనే ధాన్యం రాశులు కుప్పలు కుప్పలుగా టార్పాలిన్ కవర్లతో కప్పి దర్శనమిస్తున్నాయి. తీవ్రమైన హమాలీల కొరత ఉన్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. రాత్రనకా పగలనకా దాన్యం కాపాడుకోవడం కోసం రైతులు కొనుగోలు సెంటర్లోనే సేద తీరుతున్నారు. కొనుగోలు జరిపిన ధాన్యాన్ని మిల్లర్లు వెనుక పంపడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన ధాన్యం పేరిట కోత విధిస్తూ కింటాలు క్వింటాళ్లు రైస్ మిల్లర్లు మాయం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకొని కొనుగోలు వేగవంతం చేయాలని వేడుకుంటున్నారు. రామంచ రోడ్డుపై చేస్తున్న ధర్నాను విషయం తెలుసుకున్న చిన్నకోడూరు ఎస్సై చంద్రమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులను ధర్నా విరమింపజేశారు చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తెలంగాణ భవన్‌లో రాష్ట్రా ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha