Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గడువు పొడిగించాలని ఈసీకి విజ్ఞప్తి.. !

గడువు పొడిగించాలని ఈసీకి విజ్ఞప్తి.. !

వార్త 3 weeks ago

S.I.R : తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు ఉన్న గడువును మరో మూడు వారాలు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం కేంద్ర ఎన్నికల (S.I.R) సంఘాన్ని కోరినట్లు తాజా సమాచారం.

ప్రస్తుతం ఈ గడువు సెప్టెంబర్ 16తో ముగియనుంది. గడువు పొడిగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఓటర్ల నుంచి, రాజకీయ పార్టీల నుంచి :

ఓటర్ల నుంచి, రాజకీయ పార్టీల నుంచి వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని మరింత సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్రెడ్డి కూడా క్లెయిమ్స్, అభ్యంతరాల గడువును నాలుగు వారాలు పొడిగించాలని గతంలో లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. అలాగే నోటీసులు అందుకున్న ఓటర్లకు తమ వాదనను వినిపించేందుకు అదనపు సమయం, ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో హెల్ప్డెస్క్లు, అదనపు సిబ్బంది ఏర్పాటు చేయాలని కోరారు.

తెలంగాణలో ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితాను ఆగస్టు 17న ప్రచురించారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించేలా తొలుత షెడ్యూల్ రూపొందించారు. నోటీసుల జారీ, వాటిపై విచారణ, క్లెయిమ్స్-అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 15 వరకు కొనసాగాల్సి ఉంది. తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 19న ప్రకటించాల్సి ఉంది. ఇక ఎస్ఐఆర్ ముసాయిదాలో 73.39 లక్షల మంది ఓటర్ల పేర్లు ASD (Absent, Shifted, Dead) కేటగిరీలో ఉండగా, దాదాపు 92 లక్షల మంది ఓటర్లకు వివిధ కారణాలతో నోటీసులు జారీ చేయాల్సి ఉంది.

వీరిలో తమ పేర్లు, వివరాలపై అభ్యంతరాలు ఉన్నవారికి తగిన ఆధారాలతో వివరణ ఇచ్చే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికే నోటీసుల విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర CEO సీ. సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రికార్డులను జాగ్రత్తగా పరిశీలించి, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గడువు పొడిగింపునకు ఈసీ ఆమోదం లభిస్తే, వేలాది మంది ఓటర్లకు తమ వివరాలను పరిశీలించుకుని, అవసరమైన క్లెయిమ్స్ లేదా అభ్యంతరాలు దాఖలు చేసేందుకు మరింత సమయం లభించనుంది. అయితే పొడిగింపుపై తుది నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక ఉత్తర్వుల తర్వాతే స్పష్టమవుతుంది

ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ.. !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha