Gadwal fire accident: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని 11వ వార్డులో ఆదివారం కలకలం రేగింది. అక్కడున్న నయీ మసీదు స్టోర్ రూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుంది. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Read also: Jagitial News: ఆస్తి కోసం కోడలి మృతదేహానికి అత్తింట్లోనే గుంత!
Fire accident at Gadwal Masjid room
Gadwal fire accident: షాట్ సర్క్యూట్ వల్లనే మంటలు
ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. స్టోర్ రూమ్‌లో వైర్లు రాపిడికి గురై మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు కానీ లోపల ఉన్న సామగ్రి కొంత వరకు కాలిపోయింది. సకాలంలో ఫైర్ సిబ్బంది రాకపోతే నష్టం ఇంకా ఎక్కువగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు.
సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది
మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి వాటిని అదుపులోకి తెచ్చారు. అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విద్యుత్ సరఫరాలో లోపాలను సరిచేయాలని సూచించారు. మసీదు కమిటీ సభ్యులు కూడా అప్రమత్తమై మిగిలిన సామాన్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉత్కంఠ నెలకొంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
రైతులకు తీపి కబురు.. మే 5-7 వరంగల్లో 50-90% సబ్సిడీ యంత్రాలు: పొంగులేటి ప్రకటన

