Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆస్తి కోసం కోడలి మృతదేహానికి అత్తింట్లోనే గుంత!

ఆస్తి కోసం కోడలి మృతదేహానికి అత్తింట్లోనే గుంత!

వార్త 1 month ago

Jagitial News: జగిత్యాల జిల్లాలో ఒక ఆస్తి వివాదం ఊహించని మలుపు తిరిగింది. వంజరివాడలో నివసించే శారద కొడుకు రాజు మూడేళ్ల క్రితమే చనిపోయాడు. అప్పటి నుంచి కోడలు మాధురి తన కుమారుడితో కలిసి పుట్టింట్లో ఉంటోంది.

అయితే, అత్త శారద తన ఆస్తిని మనవడికి కాకుండా కూతుళ్లకు ఇవ్వాలని చూడటంతో గొడవ మొదలైంది. ఈ క్రమంలోనే మాధురి అనారోగ్యంతో మరణించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఆస్తి కోసం అత్త మొండికేయడంతో మాధురి బంధువులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

Read also: UP Crime: పెళ్లిలో పెను విషాదం.. వరుడిని కాల్చి చంపిన దుండగులు

 Jagitial woman body property dispute.

Jagitial News: మనవడికి ఆస్తి ఇవ్వాలని పట్టు.. అత్త ఇంటి నట్టింట్లోనే తవ్వకాలు!

శనివారం రాత్రి మాధురి చనిపోవడంతో, ఆమె సోదరులు మృతదేహాన్ని నేరుగా అత్తగారి ఇంటికి తీసుకువచ్చారు. చనిపోయిన రాజు వారసుడైన ధీరజ్‌కు ఆస్తిలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అత్త నిరాకరించడంతో ఆగ్రహం చెందిన బంధువులు, మృతదేహాన్ని ఆ ఇంట్లోనే పూడ్చిపెడతామని హెచ్చరిస్తూ గుంత తవ్వడం ప్రారంభించారు. ఈ హఠాత్ పరిణామంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. ఆస్తి ఇవ్వనిదే అంత్యక్రియలు జరిపేది లేదని మాధురి కుటుంబ సభ్యులు భీష్మించుకు కూర్చున్నారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. ఎట్టకేలకు అంగీకరించిన అత్త!

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. చాలా సేపు చర్చలు జరిగిన తర్వాత, పోలీసులు కూడా బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. దీంతో వెనక్కి తగ్గిన అత్త శారద, తన ఆస్తిని మనవడు ధీరజ్ పేరు మీద రాసిచ్చేందుకు ఒప్పుకుంది. ఈ ఒప్పందంతో వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాతే మాధురి మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఆస్తి వ్యామోహం బంధాల మధ్య ఎంతటి దూరాన్ని పెంచిందో ఈ ఘటన నిరూపించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha