Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గణేష్ నిమజ్జనం వేళ ప్రత్యేక  రైళ్లు.. పూర్తి టైమింగ్స్ ఇవే

గణేష్ నిమజ్జనం వేళ ప్రత్యేక రైళ్లు.. పూర్తి టైమింగ్స్ ఇవే

వార్త 1 week ago

MMTS Special Trains:హైదరాబాద్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది.

భక్తులు, ప్రయాణికులకు రాత్రివేళల్లో రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక MMTS రైళ్లను నడపనుంది. సెప్టెంబర్ 25, 26, 27 తేదీల రాత్రుల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య వివిధ మార్గాల్లో మొత్తం 8 ప్రత్యేక MMTS సర్వీసులు నడవనున్నాయి.

Read Also :Khairatabad Ganesh Immersion:గణేష్ నిమజ్జనం కోసం భాగ్యనగరం రెడీ.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే

ఏయే మార్గాల్లో ప్రత్యేక రైళ్లు?

ప్రత్యేక MMTS రైళ్లు సికింద్రాబాద్, హైదరాబాద్, లింగంపల్లి, ఫలక్‌నుమా ప్రాంతాలను కలుపుతూ నడుస్తాయి. ఆయా మార్గాల్లోని అన్ని MMTS స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి.

రైలు నంబర్మార్గంబయలుదేరుచేరుకునే సమయం
GSH-1సికింద్రాబాద్ - హైదరాబాద్23:5000:20
GHL-2హైదరాబాద్ - లింగంపల్లి00:3001:20
GLH-3లింగంపల్లి - హైదరాబాద్01:5002:40
GHS-4హైదరాబాద్ - సికింద్రాబాద్03:3004:00
GHL-5హైదరాబాద్ - లింగంపల్లి23:1023:55
GLF-6లింగంపల్లి - ఫలక్‌నుమా00:1001:50
GFS-7ఫలక్‌నుమా - సికింద్రాబాద్02:2003:00
GSH-8సికింద్రాబాద్ - హైదరాబాద్04:0004:40

నిమజ్జనం తర్వాత ప్రయాణికులకు ఊరట

గణేష్ నిమజ్జనం, శోభాయాత్రల్లో పాల్గొనే భక్తులు రాత్రివేళల్లో ఇబ్బందులు పడకుండా ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. నిమజ్జనం కార్యక్రమాలు పూర్తయ్యాక తమ ఇళ్లకు తిరిగి వెళ్లే వారికి కూడా ఈ సర్వీసులు ఉపయోగపడనున్నాయి.

MMTS Special Trains: మూడు రోజుల పాటు ప్రత్యేక సేవలు

సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు రాత్రివేళల్లో ప్రత్యేక MMTS సర్వీసులు అందుబాటులో ఉంటాయి. నిమజ్జనం సందర్భంగా నగరంలో పెరిగే ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు భక్తులకు సురక్షితమైన ప్రజా రవాణా సదుపాయం కల్పించడమే లక్ష్యంగా SCR ఈ ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక MMTS రైళ్లు నిర్ణయించిన మార్గాల్లోని అన్ని స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమ గమ్యస్థానానికి అనుగుణంగా రైలు సమయాలను ముందుగానే చూసుకుని ప్రయాణించవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha