HYD Traffic: హైదరాబాద్ మహానగరంలో రానున్న కొన్ని రోజులు ట్రాఫిక్ పరంగా అత్యంత కీలకమైనవిగా మారనున్నాయి. ఒకపక్క వాతావరణ శాఖ హెచ్చరించిన భారీ వర్ష సూచన, మరోపక్క వినాయక నిమజ్జన శోభాయాత్రలు ఒకేసారి రావడంతో సైబరాబాద్ పరిధిలో రోడ్లపై తీవ్ర రాకపోకల అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంది.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముందస్తు అప్రమత్తతా చర్యలు చేపట్టారు.
ట్రాఫిక్ చిక్కులను నివారించేందుకు ఐటీ సంస్థలు, ఇతర ప్రైవేట్ కంపెనీలకు సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు. సెప్టెంబర్ 18 నుంచి 25వ తేదీ వరకు ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆఫీసులకు వచ్చే ఉద్యోగుల కోసం మధ్యాహ్నం 2 గంటల నుంచే విడతల వారీగా (Staggered Logouts) పంపి వేయాలని సూచించారు. దీనివల్ల సాయంత్రం వేళల్లో రోడ్లపై ఒక్కసారిగా రద్దీ పెరగకుండా నివారించవచ్చని భావిస్తున్నారు.
Read Also : TGTDC: త్వరలో అందుబాటులోకి ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు
Ganesh Immersion: Police warning on traffic congestion; new rules effective today.
Cyberabad Traffic Advisory: విద్యాసంస్థలకు ఆన్‌లైన్ క్లాసుల విజ్ఞప్తి
వర్షాలు, ట్రాఫిక్ జామ్‌ల కారణంగా విద్యార్థులు, చిన్నపిల్లలు పడే ఇబ్బందులను నివారించేందుకు విద్యాసంస్థలు కూడా కీలక నిర్ణయం తీసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. నేటి నుంచి 25వ తేదీ వరకు పాఠశాలలు, విద్యాసంస్థలు ఆన్‌లైన్ లేదా వర్చువల్ మోడ్‌లో పాఠాలు నిర్వహించాలని కోరారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాల రిస్క్ తగ్గడమే కాకుండా, విద్యార్థుల ప్రయాణ ఇబ్బందులకు చెక్ పడుతుందని స్పష్టం చేశారు.
ట్రాఫిక్ నివారణకు ప్రజల సహకారం కోరిన పోలీసులు
ఈ వారం రోజుల పాటు ట్రాఫిక్ వ్యవస్థ సజావుగా సాగేందుకు, అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రైవేట్ సంస్థలు, స్కూళ్లు, ప్రజలందరూ పూర్తిగా సహకరించాలని సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) విజ్ఞప్తి చేశారు. వాతావరణ పరిస్థితులు, గణేష్ శోభాయాత్రల దృష్ట్యా ప్రజలు తమ ప్రయాణాలను వీలైనంత వరకు ప్రణాళికాబద్ధంగా మార్చుకోవాలని సూచించారు.

