KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ (Formula E) కార్ రేసింగ్ కేసుకు సంబంధించి జరుగుతున్న విచారణలో భాగంగా ఆయన కోర్టుకు వస్తున్నారు.
ఇప్పటికే ఈ వ్యవహారంలో ఏసీబీ (ACB) అధికారులు కేటీఆర్‌ను విచారించిన సంగతి తెలిసిందే.
ACB Investigation
నిబంధనల ఉల్లంఘన మరియు ప్రభుత్వానికి భారీ నష్టం ఆరోపణలు
హైదరాబాద్ వేదికగా 2023లో నిర్వహించిన ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహణ కోసం విదేశీ సంస్థకు ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా నిధులు బదలాయించారనే ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ చెల్లింపుల వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.54.88 కోట్ల భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
భూవివాదంపై స్పష్టతనిచ్చిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి

