Dailyhunt
గంగమ్మ ఆలయంలో రాజకీయాలు నిషిద్ధం.. టీటీడీ చైర్మన్ ఇష్యూపై ఈఓ సీరియస్ వార్నింగ్!

గంగమ్మ ఆలయంలో రాజకీయాలు నిషిద్ధం.. టీటీడీ చైర్మన్ ఇష్యూపై ఈఓ సీరియస్ వార్నింగ్!

వార్త 0 months ago

Tathayagunta Gangamma Temple: వివిధ వాట్సాప్ గ్రూప్స్ లో సర్కులేట్ అయిన సమాచారాన్ని బట్టి, వై ఎస్ ఆర్ సి పి నాయకులు ,పార్టీ శ్రేణులు రేపు 04-04-2026 న ఉదయం 9 గంటలకు తిరుపతి లోని తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం వద్ద టీటీడీ చైర్మన్ బి.

ఆర్. నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని సమాచారము.

Read Also:TTD: అలిపిరి నడక మార్గంలో భక్తుల రక్షణ కోసం సరికొత్త టెక్నాలజీ!

 YSRCP Plans Rituals Over B.R. Naidu’s Resignation; Temple Administration Set to Intervene.

తిరుపతి జిల్లా తిరుపతి పట్టణంలో వెలసిన్న తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానము చాలా పురాతనమైన ప్రసిద్ధిగాంచిన దేవాలయము. ఈ దేవస్థానం లో ఉన్న అమ్మవారు ఎంతో మహిమగల దేవత. ఇంతటి మహిమగల ఈ అమ్మవారిని దర్శించుకొనుటకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. కావున కేవలము భక్తులు దేవాలయమునకు అమ్మవారిని భక్తి భావముతో పూజించుకొనుటకు మాత్రమే రావలయును. Tathayagunta Gangamma Temple: నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు. అమ్మవారి ఆలయము రాజకీయాలకు వేదిక కాకూడదు అని భక్తులు కోరుతున్నారు. ఆలయ పవిత్రతను కాపాడుకొనుట తిరుపతి పట్టణ వాసులుగా మన అందరి బాధ్యత. అలాగే దేవాలయము ప్రాంగణంలో గాని, పరిసర ప్రాంతంలో గాని పత్రికా సమావేశాలు నిర్వహించడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బ తినే అవకాశం ఉన్నది. ఆలయ పవిత్రతను కాపాడుటం మరియు భక్తుల ఆధ్యాత్మిక భావాలకు భంగం కలగకుండా చూడటం కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం ప్రకారము ఆలయ ప్రాంగణంలో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు మరియు రాజకీయ ప్రసంగాలు చెయ్యకూడదు. భక్తి భావాలకు, ఆలయ పవిత్రతకు భంగం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడుననీ ఆలయ ఈ ఓ జయకుమార్ తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

హనుమాన్ జయంతి సందర్బంగా హైదరాబాద్ లో ఉత్సవాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha