Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ

గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ

వార్త 1 week ago

Garividi Lakshmi Movie: ఆనంది, వీకే నరేష్, రాగ్ మయూర్ ప్రధాన పాత్రల్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై కృతి ప్రసాద్, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం 'గరివిడి లక్ష్మి'.

గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక గొప్ప జానపద, బుర్రకథ కళాకారిణి జీవిత విశేషాల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఆడియెన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.

Aakasamlo Oka Thara: దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' టీజర్ విడుదల

 Garividi Lakshmi Movie Review

Garividi Lakshmi Movie: కథ

విజయనగరం జిల్లాలోని గరివిడి గ్రామంలో ఈ కథ సాగుతుంది. దేవుడమ్మ (రాశీ) కూతురు లక్ష్మి (ఆనంది). తండ్రి దూరమవడంతో లక్ష్మిని తల్లి దేవుడమ్మే ఎంతో కష్టపడి పెంచుతుంది. కొన్నేళ్లకు లక్ష్మికి పెళ్లి చేసినా, ఆ బంధం రెండు నెలలకే ముగిసిపోతుంది. ఒంటరిగా మారిన లక్ష్మి జీవితంలోకి 'బుర్రకథ' ప్రవేశిస్తుంది. బుర్రకథ నేర్చుకుని, తన గాత్రంతో చిన్న స్థాయి నుంచి ఉత్తరాంధ్రను ఊపేసే స్థాయికి ఎదుగుతుంది. అయితే ఈ ప్రయాణంలో పరిచయమైన సత్తిబాబు (రాగ్ మయూర్), రాంబాబు (నరేష్) వల్ల ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? సినీ ప్రముఖులు, సమాజం ఆమె పేరుని వాడుకుని చివరికి అనాథలా ఎలా మూలకు వదిలేశారు? అందరికీ దూరంగా అజ్ఞాతంలోకి వెళ్లిన గరివిడి లక్ష్మి కథను రాజేష్ (అంకిత్ కొయ్య) అనే యంగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రపంచానికి ఎలా పరిచయం చేశాడనేదే మిగతా కథ.

విశ్లేషణ

ఒక మరుగునపడిన గొప్ప కళాకారిణి జీవితాన్ని, ఆమె కోల్పోయిన గుర్తింపును తిరిగి ఇప్పించాలనే దర్శకుడి ప్రయత్నం ఖచ్చితంగా అభినందనీయం. కథలో కావాల్సినంత డ్రామా, వ్యథ, ఎమోషన్ ఉన్నప్పటికీ.. తెరపైకి వచ్చేసరికి ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరలేదనే భావన కలుగుతుంది. బడ్జెట్ పరిమితుల వల్లో లేదా మేకింగ్ లోపాల వల్లో 'మహానటి' టెంప్లేట్‌లో సాగే కథనం అనుకున్నంతగా కట్టిపడేయదు.

ఫస్ట్ హాఫ్‌లో లక్ష్మి చిన్ననాటి ప్రయాణం, బుర్రకథ నేర్చుకోవడం, తొలి ప్రదర్శనలు, ఎదురైన అవమానాలు చూపిస్తూ కథనం సాగుతుంది. సెకండాఫ్‌లో గరివిడి లక్ష్మి వైభవాన్ని, ఆమె పేరుని, గాత్రాన్ని సినీ ప్రముఖులు మరియు సమాజం ఎంతగా వాడుకున్నారనే విషయాలను చూపించారు. నమ్మిన వారే మోసం చేయడం, చివరికి అనాథగా మిగలడం వంటి సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. క్లైమాక్స్ గుండెల్ని హత్తుకునేలా ఉంటుంది. అయితే 1970, 80, 90 కాలాల నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా కాస్ట్యూమ్స్, సెట్ వర్క్, కెమెరా పనితనం కనిపించకపోవడం కొంత నిరాశపరుస్తుంది.

నటీనటుల నటన & సాంకేతిక విభాగం

లక్ష్మి పాత్రలో ఆనంది చక్కగా నటించి, తన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. రాగ్ మయూర్, వీకే నరేష్‌లకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కాయి. రాశీ, శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న, షకలక శంకర్, ఎల్బీ శ్రీరాం తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. పాటలు థియేటర్‌లో ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, సంభాషణలు మరియు నిర్మాణ విలువలు సాధారణంగానే అనిపిస్తాయి.

Epaper: epaper.vaartha.com

కీర్తి సురేష్ బర్త్‌డే స్పెషల్.. 'జనవరి 12 విడుదల' ఫస్ట్ లుక్ అవుట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha