Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గెలిచినా దక్కని రెండో స్థానం.. 18 పాయింట్లతో మూడో ప్లేస్‌కు పరిమితం!

గెలిచినా దక్కని రెండో స్థానం.. 18 పాయింట్లతో మూడో ప్లేస్‌కు పరిమితం!

వార్త 2 days ago

SRH vs RCB IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ బ్యాటర్లు ఆర్‌సీబీ బౌలర్లను ఆటాడేసుకున్నారు.

నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు బోర్డుపై ఉంచారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 79), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 56) జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా, మిడిలార్డర్‌లో హెన్రిచ్ క్లాсен (24 బంతుల్లో 51) కూడా హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఆఖర్లో యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి (12 బంతుల్లో 29 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

Read Also :Virat Kohli Travis Head Handshake:ట్రావిస్ హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వని కోహ్లీ!

వృథా అయిన రజత్ పటీదార్ ఒంటరి పోరాటం

256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (19 బంతుల్లో 44; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి సంచలన ఆరంభాన్ని ఇచ్చాడు. అతని ధాటికి ఆర్‌సీబీ 4.3 ఓవర్లకే 60 పరుగులు చేసింది. అయితే ఇషాన్ మలింగ బౌలింగ్‌లో అయ్యర్ అవుటైన తర్వాత బెంగళూరు ఇన్నింగ్స్ తడబడింది.

  • మలుపు తిప్పిన వికెట్లు: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (15), దేవదత్ పడిక్కల్ (21) త్వరగా పెవిలియన్ చేరడంతో ఆర్‌సీబీ ఒత్తిడిలో పడింది.
  • పటీదార్ హాఫ్ సెంచరీ: ఈ దశలో కెప్టెన్ రజత్ పటీదార్ (39 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్సర్) ఒంటరి పోరాటం చేస్తూ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కానీ అవసరమైన రన్ రేట్ కొండలా పెరిగిపోవడంతో పటీదార్ కూడా అవుటయ్యాడు. ఆఖర్లో కృనాల్ పాండ్య (41 నాటౌట్), టిమ్ డేవిడ్ (15 నాటౌట్) పోరాడినా ఆర్‌సీబీ నిర్ణీత ఓవర్లలో లక్ష్యానికి 55 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో మలింగ రెండు వికెట్లు తీయగా, సాకిబ్ హుస్సేన్, ట్రావిస్ హెడ్ చెరో వికెట్ పడగొట్టారు.

పాయింట్ల పట్టిక సమీకరణాలు: ఎస్‌ఆర్‌హెచ్‌కు మూడో స్థానం

 Sunrisers Hyderabad Victory

ఈ గెలుపుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచ్‌లలో 9 విజయాలు (18 పాయింట్లు) నమోదు చేసింది. అయితే, నెట్ రన్ రేట్ సమీకరణాల వల్ల రెండో స్థానానికి చేరాలన్న హైదరాబాద్ ఆశలు నెరవేరలేదు. లీగ్ దశ ముగిసేసరికి ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్, ఎస్‌ఆర్‌హెచ్ మూడు జట్లు కూడా తలా 18 పాయింట్లతో సమానంగా నిలిచాయి. కానీ మెరుగైన రన్ రేట్ కారణంగా ఆర్‌సీబీ మొదటి స్థానంలో, గుజరాత్ టైటాన్స్ రెండో స్థానంలో నిలవగా, సన్‌రైజర్స్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

SRH vs RCB IPL 2026: ముల్లన్‌పూర్‌లో ఎలిమినేటర్ పోరు

టాప్-3 బెర్తులు కన్ఫర్మ్ కావడంతో ఇప్పుడు నాలుగో ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్, పంజాబ్, కోల్‌కతా, ఢిల్లీ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ నెల 27న ముల్లన్‌పూర్ వేదికగా 'ఎలిమినేటర్' మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఫైనల్ రేసులో (క్వాలిఫయర్ 2) ఉంటుంది, ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఈరోజు పంజాబ్ గెలవకపోతే ఇంటికే !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha