Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ కు కారణాలు ఇవే - దిల్ రాజు

'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ కు కారణాలు ఇవే - దిల్ రాజు

వార్త 1 week ago

Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'గేమ్ ఛేంజర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

ఈ భారీ ప్రాజెక్ట్ ఫ్లాప్ అవ్వడంపై చిత్ర నిర్మాత దిల్ రాజు తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా అనుకున్న సమయానికి రాకుండా దాదాపు మూడు సంవత్సరాల పాటు ఆలస్యం కావడం చిత్ర ఫలితాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని ఆయన అంగీకరించారు. ముఖ్యంగా, దేశంలో ఎన్నికల హడావుడి అంతా ముగిసిపోయిన తర్వాత, మళ్లీ ఎలక్షన్స్ మరియు పొలిటికల్ రిఫార్మ్స్ నేపథ్యంలో సాగే కథను తెరపై చూపిస్తే ప్రేక్షకులు ఎలా కనెక్ట్ అవుతారని ఆయన ప్రశ్నించారు. సమయానుకూలంగా రావాల్సిన సినిమా కాస్తా బాగా లేట్ అవ్వడం వల్ల కథలో ఉండాల్సిన కొత్తదనం, ఆసక్తి పూర్తిగా మిస్ అయ్యాయని దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

రూ. 75 కోట్ల పాటలు ఉన్నా.. కంటెంట్ లేకపోతే వేస్టే!

సినిమాలో కేవలం విజువల్ గ్రాండ్‌నెస్, భారీ బడ్జెట్ మాత్రమే ఉంటే సరిపోదని, బలమైన కథాంశం (కంటెంట్) లేకపోతే ప్రేక్షకులు ఆదరించరని దిల్ రాజు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘గేమ్ ఛేంజర్’ మూవీలోని కేవలం నాలుగు పాటల కోసమే తాము ఏకంగా రూ.75 కోట్ల భారీ బడ్జెట్‌ను ఖర్చు చేసినట్లు ఆయన వెల్లడించారు. శంకర్ మార్క్ విజువల్స్, అద్భుతమైన సాంగ్స్ ఉన్నప్పటికీ, కథలో ఆకట్టుకునే కంటెంట్ లేనప్పుడు ఎంత ఖరీదైన పాటలు పెట్టినా ప్రయోజనం శూన్యమని ఆయన కుండబద్దలు కొట్టారు. సినిమా నిర్మాణంలో ఎంత ఖర్చు పెట్టామనే దానికంటే, ప్రేక్షకుడిని మెప్పించే కథ ఉందా లేదా అనేదే ముఖ్యం అనే చేదు నిజం ఈ సినిమాతో మరోసారి రుజువైందని దిల్ రాజు విశ్లేషించారు.

మహేశ్ బాబు 'వారణాసి' షూటింగ్‌ ముగింపుపై బిగ్ అప్‌డేట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha