Varanasi movie update: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పాన్-వరల్డ్ అడ్వెంచర్ చిత్రం 'వారణాసి' (SSMB29) అప్‌డేట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక ‘ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్’లో పాల్గొన్న రాజమౌళి, ఒక అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ చిత్రానికి సంబంధించిన కీలకమైన సాంకేతిక, షూటింగ్ వివరాలను పంచుకున్నారు.
Read Also: Tukra Ke Mera Pyar Season 2: ఓటీటీలో అలరిస్తున్న 'తుక్రా కే మేరా ప్యార్' సీజన్ 2
Big update on the wrap-up of Mahesh Babu’s ‘Varanasi’ shoot!
Varanasi movie update: మరో నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి!
చిత్రీకరణ పురోగతిపై రాజమౌళి స్పందిస్తూ, మరో నాలుగు నెలల్లో.. అంటే ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ ,మేజర్ షూటింగ్ మొత్తం పూర్తవుతుందని స్పష్టం చేశారు. చిత్రంలోని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు, వారణాసిలో జరగాల్సిన ప్రధానమైన షెడ్యూల్స్ ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయని జక్కన్న వెల్లడించారు. ప్రస్తుతం కేవలం కథను ముందుకు నడిపే కొన్ని చిన్న చిన్న సన్నివేశాలు, ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ చిత్రాన్ని ఐమాక్స్ ఫార్మాట్‌లో రూపొందించడంపై రాజమౌళి ఆసక్తికరమైన సాంకేతిక రహస్యాలను పంచుకున్నారు. ఐమాక్స్ లార్జ్ స్క్రీన్ ఫార్మాట్ కోసం కథలో ఎలాంటి మార్పులు చేయలేదని, కేవలం సాంకేతిక సర్దుబాట్లు మాత్రమే చేశామని తెలిపారు. సాధారణ సినిమా స్కోప్ మరియు ఐమాక్స్ స్క్రీన్లు.. రెండింటికీ సరిపోయేలా ‘అనోమార్ఫిక్ ఫ్రేమింగ్’ అనే ప్రత్యేక సాంకేతిక పద్ధతిని ఉపయోగించి విజువల్స్ డిజైన్ చేస్తున్నట్లు వివరించారు. మొదట్లో ఈ టెక్నిక్‌తో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఆ తర్వాత టీమ్‌కు పని సులభంగా సాగిందని చెప్పారు. ఈ కథలోని విజువల్స్ ఐమాక్స్ తెరపై చూస్తేనే ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
గ్లోబల్ స్టార్స్‌తో మెగా విజువల్ వండర్
‘ఆర్ఆర్ఆర్’ (RRR) వంటి అంతర్జాతీయ విజయం తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ భారీ విజువల్ వండర్‌ను 2027 ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘనంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రాజమౌళి తాజా ప్రకటనతో సినిమా షూటింగ్ శరవేగంగా ముగింపు దశకు చేరుకుందనే క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
విజయ్ దేవరకొండ 'రణబాలి'పై రూమర్స్.. రెస్పాండ్ అయిన మైత్రి నిర్మాత

