Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఘజియాబాద్‌లో అర్ధరాత్రి ఎన్‌కౌంటర్: బాలుడి హత్య కేసు నిందితుడు అసద్ హతం!

ఘజియాబాద్‌లో అర్ధరాత్రి ఎన్‌కౌంటర్: బాలుడి హత్య కేసు నిందితుడు అసద్ హతం!

వార్త 2 weeks ago

Ghaziabad Encounter Asad:ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని ఘజియాబాద్‌ (Ghaziabad) పట్టణంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ ఎన్‌కౌంటర్‌ (Encounter) చోటుచేసుకుంది.

ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 17 ఏళ్ల బాలుడు సూర్యప్రతాప్ చౌహాన్ (Suryapratap Chauhan) హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్ (Asad) పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. తనిఖీలు చేస్తున్న పోలీసులపై నాటు పిస్టల్‌తో కాల్పులు జరిపి తప్పించుకునేందుకు యత్నించిన అసద్‌ను రక్షణాత్మక చర్యల్లో భాగంగా పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఆపరేషన్‌లో ఒక పోలీస్ కానిస్టేబుల్‌కు కూడా గాయాలయ్యాయి.

Read Also :Chamba Road Accident:లోయలో పడ్డ పర్యాటకుల ట్యాక్సీ.. 8 మంది గల్లంతు!

బక్రీద్ పండుగ నాడు దారుణ హత్య

 UP Police Encounter Today

ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలో బక్రీద్ పండుగ రోజున సూర్యప్రతాప్ చౌహాన్‌ అనే మైనర్ బాలుడిని అసద్, అతడి అనుచరులు కలిసి కత్తులతో పొడిచి దారుణంగా హత్యచేశారు. ఈ ఘోర ఘటనతో ఘజియాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితులను తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ పలు హిందూ సంఘాలు, స్థానికులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి, ముగ్గురిని వెంటనే అరెస్ట్ చేశారు. అయితే, ప్రధాన సూత్రధారి అయిన అసద్ పరారీలో ఉండటంతో యూపీ పోలీసులు అతడి తలపై రూ. 50,000 రివార్డు ప్రకటించి గాలింపు ముమ్మరం చేశారు.

Ghaziabad Encounter Asad:బైక్‌పై పారిపోతుండగా చుట్టుముట్టిన పోలీసులు

శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అసద్ ఘజియాబాద్ నగరం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం (ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్) అందింది. దాంతో ఖోడా, ఇందిరాపురం ప్రాంతాల పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. బైక్‌పై వస్తున్న అసద్‌ను పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా.. అతడు లొంగిపోకుండా తన వద్దనున్న నాటు పిస్టల్‌తో పోలీసులపైకి కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఒక కానిస్టేబుల్‌కు బుల్లెట్ గాయమైంది. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అసద్ ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. రక్తపు మడుగులో పడిపోయిన అతడిని పోలీసులు వెంటనే సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

అనుచరుడి కోసం ముమ్మర గాలింపు

ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో బైక్‌పై అసద్ వెనుక కూర్చున్న అతడి ప్రధాన అనుచరుడు చీకటిని ఆసరాగా చేసుకొని ఘటనా స్థలం నుండి అడవుల్లోకి పరారయ్యాడు. ప్రస్తుతం అతడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటనా స్థలం నుండి నిందితులు ఉపయోగించిన మోటార్‌ సైకిల్, నాటు పిస్టల్ మరియు కొన్ని బుల్లెట్లను ఫోరెన్సిక్ బృందం స్వాధీనం చేసుకుంది. కాల్పుల్లో గాయపడిన పోలీస్ కానిస్టేబుల్‌కు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించారని, ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుండి బయటపడి నిలకడగా ఉన్నారని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర ప్రమాదం..22 మంది మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha