Minister Sridhar Babu:ఘనా పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ మార్గనిర్దేశం మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి,రిపబ్లిక్ ఆఫ్ ఘనా పారిశ్రామికాభివృద్ధికి మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
అక్కడ ఏర్పాటు చేయనున్న ఫార్మా హద్దు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ దేశ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ ఆగస్టస్ ఒబువాడుంటానో నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో బుధవారం మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ ఘన్హా మధ్య ద్వైపాక్షి క సంబంధాలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవకాశాలపై విసృతంగా చర్చించారు. ఘనా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 24 అవర్ ఎకానమీ అండ్ యాక్సలరేటెడ్ ఎక్స్ పోర్ట్ డెవలెప్ మెంట్ ప్రోగ్రాం, ఫార్మా హబ్ ఏర్పాటు తదితర అంశాలను ఆగస్టన్ ఒబువాడుంటానో వివరించారు.
Read also: Heavy Rain in Hyderabad : భారీ వర్షంతో ట్రాఫిక్ నరకం..ఇబ్బంది పడ్డ ఉద్యోగులు
Telangana industrial growth in Ghana
Minister Sridhar Babu:ఫార్మా రంగంలో తెలంగాణ అండ
ఘనా పారిశ్రామిక, ఆర్ధిక పరివర్తనకు సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబును విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… అనతికాలంలోనే పారిశ్రామిక రంగంలో తెలంగాణ అద్భుతమైన వృద్ధిని నమోదు చేసిందన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, డిఫెన్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ తదితర రంగాల్లో కేంద్రంగా అంతర్జాతీయ ఎదిగిందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామి కాభివృద్ధిని ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ పాలసీలను ఆయన వివరించారు. ఫార్మాన్యూటికల్ మ్యాను ఫ్యాక్చరింగ్, రీసెర్చ్, వ్యాక్సీన్ల తయారీ, గ్లోబల్ సప్లై చైన్ నిర్వహణ, లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణకున్న అంతర్జాతీయ నైపుణ్యాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఘనా ప్రతినిధులకు చెప్పారు. మనా పారిశ్రామిక, ఆర్థిక పరివర్తనలో తెలంగాణ ఒక నమ్మకైన భాగస్వామిగా ఉంటుందని భరోసానిచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

