Hanuman Jayanti in Tirupati: తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి స్థానిక పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరంలో హనుమంతుని విగ్రహానికి పంచామృతాలు తో అభిషేకం నిర్వహించారు అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read Also: Anantapur: డీ.హిరేహళ్‌లో సర్పంచ్‌లకు ఘన వీడ్కోలు
Hanuman Jayanti in Tirupati
పాల్గొన్న ప్రముఖులు
ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. మహాబలుడు శ్రీరామ దూత దాశ భక్తికి ప్రతినిధి హనుమన్ జయంతి నేడు అత్యంత వైభవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు హనుమంతుని కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం లో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ కార్యదర్శి, కే ఎన్ రాజా, సభ్యులు లోక ప్రభాకర్ నాయుడు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎల్ కృష్ణయ్య,సుధాకర్ చౌదరి, శ్రీరామ భజన మందిరం సభ్యులు లక్ష్మమ్మ, అనిత, విజయమ్మ,తొండమనాటి చంద్రశేఖర్ రెడ్డి, పొన్నాల జేజిరెడ్డి,విశ్రాంత ఉపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి, అక్కిపల్లి మునికృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

