ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి రాజకీయ సెగలు రేపుతోంది. అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026ను ఆమోదించిన నేపథ్యంలో..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక వినూత్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీనిని ఆయన రాజధాని ప్రాంతాభివృద్ధికి సంబంధించి “ప్లాన్ బి”గా అభివర్ణించారు. జగన్ ప్రతిపాదించిన ఈ కొత్త నమూనాలో ప్రధానాంశం మావిగున్’ (MAVIGUN) అని చెప్పవచ్చు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ సుమారు 110 కిలోమీటర్ల పొడవైన పట్టణ కారిడార్‌ను సమీకృత రాజధాని ప్రాంతంగా ప్రకటించాలని ఆయన కోరారు. మచిలీపట్నం నుండి విజయవాడకు 70 కిలోమీటర్లు, విజయవాడ నుండి గుంటూరుకు 40 కిలోమీటర్ల దూరం ఉందని, ఈ మూడు ప్రాంతాలను కలిపితే సహజసిద్ధమైన ఆర్థిక సమూహం ఏర్పడుతుందని ఆయన వివరించారు.
Read Also: Andhra Pradesh: తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై చంద్రబాబు కీలక ప్రకటన
Andhra Pradesh
Andhra Pradesh: లోక్‌సభలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు వాకౌట్
ఈ ప్రాంతంలో ఇప్పటికే సుమారు 40 లక్షల జనాభా ఉందని, మౌలిక సదుపాయాలపై ఇక్కడ పెట్టే పెట్టుబడి తక్కువ కాలంలోనే గరిష్ట ఫలితాలను ఇస్తుందని జగన్ వాదించారు. అభివృద్ధిని కేవలం అమరావతి(Amaravathi) అనే పరిమిత ప్రాంతానికే పరిమితం చేయకుండా, ఈ కారిడార్ అంతటా వికేంద్రీకరించాలని ఆయన సూచించారు. మరోవైపు, లోక్‌సభలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు వాకౌట్ చేశారు. పి. మిథున్ రెడ్డి నేతృత్వంలోని ఎంపీల బృందం ఈ బిల్లును కేవలం రాజకీయ ప్రేరేపితమైనదిగా విమర్శించింది. అమరావతి ప్రాజెక్టు ఆర్థిక సాధ్యాసాధ్యాలపై జగన్, ఆయన పార్టీ నేతలు తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. అమరావతిలో కేవలం ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకే దాదాపు రూ. 2 లక్షల కోట్లు అవసరమవుతాయని.. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఇంత భారీ నిధులను ఎక్కడి నుండి సమీకరిస్తుందని వారు ప్రశ్నించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

