Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఘట్‌కేసర్ పరిధిలో రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!

ఘట్‌కేసర్ పరిధిలో రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!

వార్త 23 hrs ago

Warangal couple death: హైదరాబాద్ నగర శివార్లలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దంపతులు రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డారు.

మృతులను హైదరాబాద్‌లోని కుంట్లూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రవికుమార్, శిరీషలుగా పోలీసులు గుర్తించారు. రైల్వే ట్రాక్‌పై దంపతుల మృతదేహాలు పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Read Also: Sai Krishna Case:సాయికృష్ణ కేసులో ట్విస్ట్: నేను నిర్దోషిని.. నన్ను ఇరికిస్తున్నారు.. కోర్టుకు సీఐ నాగరాజు లేఖ!

 Couple commits gruesome suicide by jumping under a train in Ghatkesar!

Warangal couple death: మృతదేహాలు గాంధీ ఆసుపత్రికి తరలింపు

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ సహాయంతో వివరాలు సేకరించిన అనంతరం, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రైల్వే మరియు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో మరణించిన రవికుమార్, శిరీష దంపతులు వరంగల్ ప్రాంతానికి చెందిన వారని తేలింది. వీరు కొంతకాలంగా కుంట్లూర్‌లో నివాసం ఉంటున్నట్లు సమాచారం. అయితే, క్షణికావేశంలో వీరు ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ కలహాలా లేక ఆర్థిక ఇబ్బందులా అనే కోణంలో పోలీసులు అన్ని రకాలుగా విచారణ జరుపుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

బాసర ఆలయంలో చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితుల అరెస్టు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha