Kolkata Hotel Fire: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని న్యూమార్కెట్ సమీపంలో ఉన్న మిర్జా గాలిబ్ వీధిలోని ఓ హోటల్‌లో (షిఖా ఇన్) బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ విషాద ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Read Also :Cyber Crime: ఒక్క క్లిక్‌తో రూ.98 వేలు మాయం.. ఇన్‌స్టాగ్రామ్ యాడ్‌తో సైబర్ మోసం

ఘటన వివరాలు & రెస్క్యూ ఆపరేషన్
బుధవారం తెల్లవారుజామున సుమారు 2:00 గంటల సమయంలో హోటల్‌లోని ఒక గదిలో మంటలు చెలరేగి వేగంగా ఇతర గదులకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే 5 అగ్నిమాపక యంత్రాలు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. హోటల్ నుంచి దాదాపు 60 మందిని సురక్షితంగా బయటకు తరలించారు. మరణించిన తొమ్మిది మందిలో ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక చిన్నారు ఉన్నారు. వీరంతా వైద్య చికిత్స నిమిత్తం బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా వచ్చి ఈ హోటల్‌లో బస చేసినట్లు అధికారులు ప్రాథమికంగా ధృవీకరించారు. దట్టమైన పొగ కారణంగా అస్వస్థతకు గురైన మరో ఆరుగురిని చికిత్స కోసం కోల్‌కతా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (SSKM) కు తరలించారు.
Kolkata Hotel Fire: దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ఘట్టంలో దట్టమైన పొగ అలుముకోవడంతో ఊపిరాడక చాలా మంది స్పృహ తప్పిపడిపోయినట్లు పోలీసులు తెలిపారు. షాట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా? లేక భద్రతా నిబంధనల ఉల్లంఘన ఉందా? అనే కోణంలో న్యూమార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి తయారీ రాయుళ్లపై హెచ్-ఫాస్ట్ మెరుపు దాడులు

