Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి తయారీ రాయుళ్లపై హెచ్-ఫాస్ట్ మెరుపు దాడులు

హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి తయారీ రాయుళ్లపై హెచ్-ఫాస్ట్ మెరుపు దాడులు

వార్త 1 month ago

HFast Raids on Ghee processing unit : హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST)బృందం తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరవ్యాప్తంగా దాదాపు 130 కేంద్రాల్లో విస్తృత తనిఖీలు చేపట్టింది.

ఈ దాడుల్లో సుమారు 25.5 టన్నుల కల్తీ నెయ్యితో పాటు, తయారీకి ఉపయోగిస్తున్న 10.5 టన్నుల ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కల్తీదారులు హర్యానా, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి నాణ్యత లేని క్రీమ్‌ను తెప్పించి పామాయిల్, స్కిమ్డ్ మిల్క్, వనస్పతి నూనె, గంజి స్టార్చ్ మరియు బొంబాయి రవ్వలను మిక్స్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. నెయ్యికి అసలైన సువాసన రావడం కోసం ఆహారంలో ఉపయోగించకూడని 3 రకాల కెమికల్ ఫ్లేవర్ బాటిళ్లను వాడుతున్నారని టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు.

Read Also: Payyavula Keshav:రాయలసీమ రైతులకు మంత్రి పయ్యావుల తీపికబురు

 HFast Raids on Ghee processing unit

HFast Raids on Ghee processing unit : వినియోగదారులకు హెచ్చరిక మరియు అధికారుల చర్యలు

ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండా లూజు నెయ్యి విక్రయించినా లేదా ప్రముఖ బ్రాండ్ల పేర్లతో కల్తీ నెయ్యి అమ్మినా చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. తక్కువ ధరకు వస్తుందని నకిలీ ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని, ఏదైనా అనుమానాస్పద కల్తీ తయారీ కేంద్రాల సమాచారం ఉంటే డయల్ 100 లేదా హెచ్-ఫాస్ట్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆహార భద్రత మరియు ఫుడ్ సేఫ్టీ మార్గదర్శకాల సమాచారం కోసంFood Safety and Standards Authority of India (FSSAI)అధికారిక పోర్టల్‌ను సందర్శించవచ్చు.

Epaper: epaper.vaartha.com

కొబ్బరి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha