Eluru Road Accident: ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా జీలుగుమిల్లి వద్ద సోమవారం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీలుగుమిల్లి హైస్కూల్ సమీపంలోని జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ఒక లారీ, ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా బలంగా ఢీకొట్టింది.
Read Also : Mahabubabad School Van Accident: చెరువులోకి దూసుకెళ్లి బోల్తాపడ్డ స్కూల్ వాహనం
Horrific accident: Lorry rams into RTC bus; 20 people injured
Eluru Road Accident: డ్రైవర్‌తో సహా 20 మందికి గాయాలు
రాజమహేంద్రవరం నుండి భద్రాచలం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు జీలుగుమిల్లి హైస్కూల్ దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.
ఆసుపత్రికి తరలింపు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

