Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఘోర ప్రమాదం! ట్రక్కును ఢీకొట్టిన కారు.. ముగ్గురు యువకులు దుర్మరణం!

ఘోర ప్రమాదం! ట్రక్కును ఢీకొట్టిన కారు.. ముగ్గురు యువకులు దుర్మరణం!

వార్త 2 weeks ago

Karnataka Road Accident: కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం హిరియూరు తాలూకా కస్తూరి రంగప్పనహళ్లి సమీపంలో జాతీయ రహదారి-48 (NH-48)పై వేగంగా వెళ్తున్న ఒక కారు ట్రక్కును బలంగా ఢీకొట్టింది.

ఈ విషాద ఘటనలో కారు డ్రైవర్‌తో సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Read Also : Alang Road Accident: గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. ట్రైలర్‌ను ఢీకొన్న SUV, ఏడుగురు మృతి

 Car crashes into truck… three youths killed!

Karnataka Road Accident: మృతులు, బాధితుల వివరాలు

ఈ ప్రమాదంలో మరణించిన వారిని కొప్పళ జిల్లా యెల్బుర్గా తాలూకాకు చెందిన కారు డ్రైవర్ శశిధర్ (22), కుష్టగి తాలూకా మడికేరి గ్రామానికి చెందిన మంజునాథ్ (22) మరియు నిదాసేసి గ్రామానికి చెందిన బసవరాజ్ (21)గా పోలీసులు గుర్తించారు. అలాగే నిదాసేసి గ్రామానికి చెందిన హనుమేష్ (22), ప్రవీణ్ సెడిసేసి (20) తీవ్రగాయాలకు గురికావడంతో, వారిని హుటాహుటిన హిరియూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

టైర్ పేలడమే ప్రమాదానికి కారణం

పోలీసులు వెల్లడించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, బాధితులు బెంగళూరు నుంచి కుష్టగికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మార్గమధ్యలో కారు ముందు వెళ్తున్న ట్రక్కు టైర్ ఒక్కసారిగా పేలడంతో, ఆ వాహనం అదుపుతప్పి ఎడమ వైపునకు తిరిగింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు సడన్‌గా ఆ ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాద తీవ్రత పెరిగింది.

సమాచారం అందుకున్న వెంటనే హిరియూరు సబ్-డివిజన్ డీఎస్పీ గోపాలకృష్ణ, హిరియూరు రూరల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కె.ఎన్. చంద్రశేఖర్ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన వాహనాలను రహదారిపై నుంచి పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనపై హిరియూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

తీరని ఆవేదన.. గురుకులంలో వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తూ నలుగురు విద్యార్థుల మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha