Four Children Died In Water Tank : ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర బృందావనంలో జరిగిన ఘోర ప్రమాదంలో సంస్కృత గురుకుల విద్యార్థులు బలయ్యారు. వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేసే క్రమంలో విషవాయువులు పీల్చి నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సమగ్ర విచారణకు ఆదేశించారు. మథురలోని బృందావనంలో ఉన్న ఓ సంస్కృత గురుకులంలో 14 అడుగుల లోతున్న భూగర్భ నీటిసంపును (వాటర్ ట్యాంక్) శుభ్రం చేస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
Visakha Gun misfire: ఐఎన్‌ఎస్ డేగా వద్ద గన్ మిస్‌ఫైర్.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
Four Children Died In Water Tank
Four Children Died In Water Tank : విషవాయువులు పీల్చడమే కారణం:
సంపులో నుంచి దుర్వాసన రావడంతో మోటార్‌తో నీరు తోడి, అడుగున చెత్తను తొలగించేందుకు తొలుత ఓ విద్యార్థి లోపలికి వెళ్లగా అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. మొదటి విద్యార్థిని కాపాడేందుకు వరుసగా లోపలికి దిగిన మరో నలుగురు విద్యార్థులు కూడా విషవాయువులు పీల్చి స్పృహ కోల్పోయారు. గమనించిన స్థానికులు ఐదుగురిని బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే నలుగురు విద్యార్థులు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో విద్యార్థి రుద్ర తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురుకులానికి సరైన అనుమతులు ఉన్నాయా? మైనర్ విద్యార్థులతో ట్యాంక్ ఎందుకు శుభ్రం చేయించారు? అనే కోణంలో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
Epaper: epaper.vaartha.com
గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. ట్రైలర్‌ను ఢీకొన్న SUV, ఏడుగురు మృతి

