Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సోషల్ మీడియాలో '80స్ రెట్రో లుక్' ట్రెండ్ - సైబర్ నేరగాళ్ల కొత్త ఉచ్చు

సోషల్ మీడియాలో '80స్ రెట్రో లుక్' ట్రెండ్ - సైబర్ నేరగాళ్ల కొత్త ఉచ్చు

వార్త 3 weeks ago

80s Look Photos Fake Apps : ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో 1980ల నాటి వింటేజ్ (రెట్రో) లుక్ ఫోటోల ఎడిటింగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వరకు తమ ఫోటోలను ’80ల నాటి బ్లాక్ అండ్ వైట్ లేదా సెపియా టోన్లలోకి మార్చుకుని సందడి చేస్తున్నారు. అయితే, ప్రజల్లో ఉన్న ఈ వింటేజ్ క్రేజ్‌ను పసిగట్టిన సైబర్ నేరగాళ్లు దీనిని తమ కొత్త మోసాలకు ఆయుధంగా మలుచుకుంటున్నారు. ఉచితంగా వింటేజ్ ఫోటోలను ఎడిట్ చేసి ఇస్తామంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు, నకిలీ థర్డ్ పార్టీ యాప్‌లు (APK లింకులు) మరియు ఏఐ (AI) టూల్స్ ద్వారా యూజర్ల మొబైల్ ఫోన్లలోకి చొరబడుతున్నారు. లింక్ క్లిక్ చేయగానే వినియోగదారుల ప్రైవేట్ డేటాను దొంగిలించే డిజిటల్ కుట్ర దీని వెనుక దాగి ఉంది.

China Delhi Flight Resume : 6ఏళ్ల తర్వాత దిల్లీకి చైనా విమాన సర్వీసులు ప్రారంభం

 80s Look Photos Fake Apps

80s Look Photos Fake Apps : యాప్ పర్మిషన్లతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ – డీప్‌ఫేక్ బెదిరింపులు

వినియోగదారులు థర్డ్ పార్టీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే క్రమంలో నిబంధనలను పరిశీలించకుండానే గ్యాలరీ, కాంటాక్ట్స్ మరియు నెట్ బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన అనుమతులు (Permissions) ఇచ్చేస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు, బాధితుల ఫోన్లను తమ నియంత్రణలోకి తీసుకుని బ్యాంక్ ఖాతాల నుంచి నగదును ఊడ్చేస్తున్నారు. మరొకవైపు, ఏఐ మరియు డీప్‌ఫేక్ సాంకేతికతను ఉపయోగించి యూజర్ల వ్యక్తిగత ఫోటోలను అశ్లీల చిత్రాలుగా మార్చేస్తున్నారు. ఆ ఫోటోలను బాధితుల కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న బంధువులు, స్నేహితులకు పంపుతామని బెదిరిస్తూ తీవ్ర ఆర్థిక, మానసిక వేధింపులకు గురిచేస్తున్నారు. ఇటువంటి ఉచ్చుల్లో పడకుండా ఉండాలంటే అపరిచిత ఏపీకే (APK) లింకులను క్లిక్ చేయకూడదని, ప్లేస్టోర్ బయటి యాప్‌లను అనుమతించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ట్రంప్ ఫోకస్ అంత బ్రిక్స్ సదస్సుపైనే !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha