Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో సజీవదహనమైన ఆరుగురు!

ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో సజీవదహనమైన ఆరుగురు!

వార్త 2 weeks ago

Uttar Pradesh Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముజఫర్‌నగర్ జిల్లాలో సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారంతా మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు.

Madhya Pradesh Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనం

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పానిపట్‌-ఖతిమా జాతీయ రహదారిపై జగహేరి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది.

Uttar Pradesh Road Accident: మృతుల్లో చిన్నారి కూడా

ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, వారిలో 10 నుంచి 12 ఏళ్ల వయసున్న చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతులంతా హర్యానాలోని జింద్ జిల్లాకు చెందినవారిగా ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Epaper: epaper.vaartha.com

కూకట్‌పల్లిలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha