Kukatpally Fire Accident: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్బెస్టాస్ కాలనీలో ఉన్న పేపర్ టీ కప్పులు, ప్లేట్ల తయారీ కంపెనీలో సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
Madhya Pradesh Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనం
నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటల అదుపు
కంపెనీలో మంటలు వ్యాపించడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Kukatpally Fire Accident: షార్ట్ సర్క్యూట్ కారణమా?

ఈ అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. అగ్నిప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

