Nepal Floods: నేపాల్ మరియు టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన విపత్తు ప్రకృతి విలయానికి అద్దం పట్టింది. గిరాంగ్ పోర్ట్ ఇమ్మిగ్రేషన్ సెంటర్‌పై విరుచుకుపడిన భారీ వరద, బండరాళ్లు మరియు బురద ప్రవాహానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియో వైరల్ అయినప్పటికీ, చైనా ప్రభుత్వం తమ దేశంలో ఈ ఫుటేజీపై తీవ్ర ఆంక్షలు విధించింది.
Read Also: Glacier Collapse : చైనా టూరిస్ట్ కెమెరాకు చిక్కిన గ్లేసియర్ కూలిన దృశ్యాలు
Nepal Floods
Nepal Floods: విపత్తు ధాటికి గిరాంగ్ పోర్ట్ ధ్వంసం
గిరాంగ్ పోర్ట్ ఇమ్మిగ్రేషన్ సెంటర్ వద్దకు కొండల మధ్య నుంచి శక్త్యంతమైన బురద ప్రవాహం ఒక్కసారిగా వచ్చి పడింది.ఆ క్షణంలో ప్రాణాలు కాపాడుకునేందుకు జనం పరుగులు తీసినప్పటికీ, ఆ భయంకరమైన వరద ధాటికి అనేక మంది కొట్టుకుపోయారు. ప్రాంగణంలో ఉన్న వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. చైనా అధికారిక మీడియా తమ న్యూస్ బులెటిన్లలో కేవలం ఒకే ఒక్క స్టిల్ ఫ్రేమ్ షాట్‌ను మాత్రమే ప్రదర్శిస్తోంది. నిజమైన వీడియో ఫుటేజీని ఎక్కడా ప్రసారం చేయడం లేదు. ఆకస్మిక వరదలకు సంబంధించిన వీడియోలు, పోస్టులను చైనా సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించారు. చైనా ఇంటర్నెట్‌లో ఈ వీడియో ఆచూకీ లేకుండా సెన్సార్‌షిప్ కఠినతరం చేసింది. వరదలు సంభవించిన కొన్ని గంటల్లోనే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారీ స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని ఆదేశించారు. షీ జిన్‌పింగ్ నేపాల్ అధ్యక్షుడు రాంచంద్ర పౌడెల్‌తో మాట్లాడి, వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రెండు దేశాలు ఉమ్మడిగా ఈ విపత్తును అధిగమిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
వరదల ముప్పును ఎదుర్కోవడానికి రాష్ట్రం సిద్ధం: హిమాచల్ గవర్నర్

