Sangareddy: సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల పరిధిలోని బొమ్మరెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలను స్థానిక తహసీల్దార్ నామాల కిష్టయ్య సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించి విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలపై ఆరా తీశారు.
Read Also : Hyderabad News: ఎల్బీనగర్‌లో వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడికి ICUలో చికిత్స
Tahsildar Namala Kishtaiah visited the tribal ashram school
Sangareddy: పనులను త్వరగా పూర్తి చేస్తామని హామీ
పాఠశాల ప్రిన్సిపాల్ భవాని తో మాట్లాడిన తహసీల్దార్ పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, భవనాల పరిస్థితి తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ భవాని మాట్లాడుతూ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి ఇప్పటికే నిధులు మంజూరయ్యాయని, అయితే కాంట్రాక్టర్ ముందుకు వచ్చి పనులు ప్రారంభించడం లేదని తెలిపారు.
దీనిపై స్పందించిన తహసీల్దార్ సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. బొమ్మ రెడ్డి గూడెం సర్పంచ్ జైపాల్ నాయక్ వార్డ్ మెంబర్లు గ్రామసులు ఉన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

